స్నేహితుని భార్యపై లైంగిక దాడి.. | Wife Molested By Husbands Friend In Karnataka | Sakshi
Sakshi News home page

స్నేహితుని భార్యపై లైంగిక దాడి.. వీడియో తీసి

Nov 1 2020 7:42 AM | Updated on Nov 1 2020 7:56 AM

Wife Molested By Husbands Friend In Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు : స్నేహితుని భార్యకు మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం చెన్నపట్టణ తాలూకా మత్తికెరెశెట్టిహళ్లిలో చోటు చేసుకుంది. వివరాలు...గ్రామానికి చెందిన సంతోష్‌ కుమార్‌కు వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఈక్రమంలో స్నేహితుని భార్యను మాగడి వద్ద ఉన్న సావనదుర్గకు తీసుకెళ్లాడు. మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడి ఆ దృశ్యాలను వీడియో తీశాడు. వాటిని చూపించి రూ.10 లక్షలు డిమాండ్‌ చేశాడు. బాధితురాలు తన నగలు విక్రయించి నగదు అందజేసింది. నగల విషయంపై కుటుంబ సభ్యులు ఆరా తీయగా ఈ ఉదంతం వెలుగు చూసింది. మహిళా సంఘాల సహకారంతో బాధితురాలు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. (సైకో డాక్టర్‌.. భార్య కాపురానికి రాలేదని..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement