
మృతురాలు కవిత(ఫైల్ ఫొటో)
తుమకూరు: పురుగుల మందు తాగి వివాహిత ఆత్మ హత్య చేసుకున్న ఘటన తుమకూరు జిల్లా హులియారు సమీపంలోని కోడిపాళ్య గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... గ్రామానికి చెందిన కవిత (37) తురువెకెరె–తిపటూరు కళాశాలల్లో ఎఫ్‌డీసీగా ఉద్యోగం చేస్తున్నారు. కోడిపాళ్యలోని ధ్యాననగరి మాతా చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకురాలిగా కూడా ఉన్నారు. ఈమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
ఇదిలా ఉంటే బుధవారం సాయంత్రం కవిత ఇంటిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా ఇంటిలోని వారు ఆస్పత్రికి తరలించారు. తుమకూరు జిల్లా ఆస్పత్రికి తరలించగా గురువారం మృతి చెందారు. భర్త నుంచి విడాకులు తీసుకుని దూరంగా ఉండడం తదితర కుటుంబ సమస్యలే కారణమని అనుమానం. కేసు దర్యాప్తులో ఉంది.
చదవండి: దూరపు బంధువులు.. 8 ఏళ్ల ప్రేమ.. ఆఖరికి..
బెంగళూరులో దారుణం.. అర్ధరాత్రి జంట హత్యలు
Comments
Please login to add a commentAdd a comment