ప్రియుడి మృతి తట్టుకోలేక ప్రియురాలు.. | Woman Takes Own Life For Deceased Lover | Sakshi
Sakshi News home page

ప్రియుడి మృతి తట్టుకోలేక ప్రియురాలు..

Published Fri, Jan 22 2021 7:17 AM | Last Updated on Fri, Jan 22 2021 11:41 AM

Woman Takes Own Life For Deceased Lover - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు : ప్రియుడు ఆత్మహత్య చేసుకుని మృతిచెందడంతో మనస్తాపం చెంది ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తమిళనాడులోని రాణిపేట జిల్లాలో చోటుచేసుకుంది. రాణిపేట జిల్లా కలవై సమీపంలో వాలైపందల్‌ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువకుడు మెకానిక్‌. ఇతనికి పొరుగు గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో యువతికి మరో యువకుడితో వివాహం చేయడానికి తల్లిదండ్రులు ఏర్పాటు చేశారు. విషయం తెలిసి ప్రియుడు మనస్తాపం చెంది మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి దహన సంస్కారాలు చేస్తుండగా విరక్తి చెందిన ఆ యువతి అదేసమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement