
పెళ్లి దృశ్యం
లక్నో : ప్రియురాలిని కలుసుకోవటానికి ఆమె ఇంటికి వెళ్లిన ప్రియుడికి జీవితంలోనే మర్చిపోలేని అనుభవం ఎదురైంది. చిన్నపిల్లాడిని లాగి పెట్టి చెంపమీద కొట్టి, ఏడ్చేలోపే నోట్లో చాక్లెట్ పెట్టినట్లు.. అడ్డంగా దొరికిపోయిన అతడ్ని రాత్రంతా ఇరక్కుమ్మిన అమ్మాయి ఇంటి సభ్యులు మరిసటి రోజు పెళ్లి చేసి పంపారు. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొద్దిరోజుల క్రితం అజిమ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుమలి నగర్‌కు చెందిన ఓ యువకుడు తన ప్రియురాలిని కలిసేందుకు అర్థరాత్రి పూట ఆమె ఇంటికి వెళ్లాడు. (ఈ వయసులో పెళ్లి సరి కాదన్నందుకు..)
ఈ నేపథ్యంలో ప్రియురాలి కుటుంబసభ్యులకు దొరికిపోయాడు. అతడ్ని ఓ రూంలో బంధించి రాత్రంతా చితకబాదారు వారు. తెల్లవారుజామున పోలీసులకు అప్పంగించారు. అయితే పోలీస్ స్టేషన్‌లో ఈ విషయమై అబ్బాయి, అమ్మాయి తరపు పెద్దలు పంచాయితీ పెట్టారు. ఆ ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఆ ఉదయమే వారిద్దరికి పెళ్లి జరిపించారు.
Comments
Please login to add a commentAdd a comment