ప్రతీకాత్మక చిత్రం
లక్నో : ప్రియురాలి చావుకు కారణమైన ఓ యువకుడిని పెళ్లికి కొన్ని నిమిషాల ముందు అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మీరట్‌కు చెందిన రాహుల్ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన యువతిని పెళ్లి పేరు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆమె గర్భవతి అయిందని తెలిసి బలవంతంగా గర్భస్రావం అయ్యే మాత్రలు మింగించాడు. ( ప్రేమించినోడే వేధించడంతో..)
దీంతో ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఆమె మీరట్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడు ఉన్న చోటుకు వెళ్లారు. అక్కడ అతడి పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లికి మరి కొన్ని నిమిషాలు మాత్రమే ఉండగా పోలీసులు రాహుల్‌ను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల క్రింద అతడిపై కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment