విఘ్నేశ్వరుని హుండీ ఆదాయం రూ.34,67 లక్షలు | - | Sakshi
Sakshi News home page

విఘ్నేశ్వరుని హుండీ ఆదాయం రూ.34,67 లక్షలు

Published Wed, Jan 29 2025 12:14 AM | Last Updated on Wed, Jan 29 2025 12:14 AM

విఘ్నేశ్వరుని హుండీ  ఆదాయం రూ.34,67 లక్షలు

విఘ్నేశ్వరుని హుండీ ఆదాయం రూ.34,67 లక్షలు

అయినవిల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి హుండీ ఆదాయాన్ని ఆలయ తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం లెక్కించారు. మొత్తం 67 రోజులకు స్వామివారి హుండీ ఆదాయం రూ.34,67,500 లభించినట్టు ఆలయ ఈఓ, అసిస్టెంట్‌ కమిషనర్‌ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. అలాగే 409 గ్రాముల వెండి, 12 వీదేశీ కరెన్సీ నోట్లు ఉన్నాయన్నారు. హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

మహా కుంభమేళాకు

ఆర్టీసీ సర్వీసు

అమలాపురం రూరల్‌: భక్తులు మహా కుంభమేళా యాత్రకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు సర్వీసును అమలాపురం డిపో నుంచి నడుపుతున్నట్టు డిపో మేనేజర్‌ చల్లా సత్యనారాయణమూర్తి మంగళవారం తెలిపారు. ఫిబ్రవరి 12న మధ్యాహ్నం 2 గంటలకు ఈ బస్సు బయలుదేరుతుందన్నారు. ఎనిమిది రోజుల పాటు భువనేశ్వర్‌, పూరి, కోణార్క్‌, ప్రయాగరాజ్‌, కుంభమేళా, వారణాసి, అయోధ్య, గయ, బుద్ద గయ, అరసవిల్లి, శ్రీకూర్మంలో పర్యటించవచ్చన్నారు. త్రివేణి సంగమంలో స్నానం, విశ్వనాథ దర్శనం, పిండ ప్రదానం చేయవచ్చని వివరించారు. ప్రయాగరాజ్‌, కాశీ క్షేత్రాల్లో ఒక రోజు బస ఉంటుందన్నారు. ఒక్కొక్కరికి టిక్కెట్‌ ధర రూ.10,800 ఉంటుందన్నారు. సరికొత్త సూపర్‌ లగ్జరీ వీడియో కోచ్‌ ఏర్పాటు చేశామన్నారు. వివరాలకు 99592 25576, 73829 09620, 99088 36444 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

నేడు జాబ్‌ మేళా

అమలాపురం రూరల్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ప్రముఖ ప్రైవేట్‌ సంస్థల్లో పని చేసేందుకు ఇదే కార్యాలయంలో బుధవారం జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి ఆధికారి ఈ.వసంతలక్ష్మి మంగళవారం ఇక్కడ తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హత ఉన్న నిరుద్యోగ యువత తమ బయోడేటా, ధ్రువపత్రాలతో బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయానికి హాజరుకావాలని చెప్పారు. ముత్తూట్‌ ఫైనాన్స్‌లో ప్రొఫెషనరీ అధికారులు, సీఆర్‌ఓ, ఇంటెన్షిప్‌ ట్రైనింగ్‌ కోసం 45 మంది అవసరం ఉందన్నారు. అమలాపురం, రాజోలు, కాకినాడ, కొత్తపేట, ముక్తేశ్వరం, రావులపాలెం, పి.గన్నవరం, రామచంద్రపురంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. శ్రీరామ్‌ ఫైనాన్స్‌లో ఇన్సూరెన్స్‌ కంపెనీలో సేల్స్‌ అధికారులు 46, సేల్స్‌ మేనేజర్లు 10 ఖాళీలున్నాయని తెలిపారు. విద్యార్హతలు టెన్త్‌ లేదా ఏదైనా డిగ్రీ ఉండాలని, వయస్సు 40 ఏళ్లలోపు ఉండాలన్నారు. టీంలీజులో బ్రాంచ్‌ రిలేషన్‌ ఎగ్జిక్యూటివ్స్‌, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌ పోస్టులు 49 ఉన్నాయని, 35 ఏళ్లలోపు, టెన్త్‌ నుంచి ఏదైనా డిగ్రీ ఉండాలన్నారు. అమలాపురం, రాజోలు, రాజమహేంద్రవరం, కాకినాడ, తుని, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరంలో పనిచేయాలన్నారు. కిమ్స్‌లో ఆయు భరోసా మార్కెటింగ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు 15 ఖాళీలున్నాయని తెలిపారు. వయస్సు 35 ఏళ్లలోపు, ఏదైనా డిగ్రీ ఉండాలని చెప్పారు. కోనసీమ జిల్లాలో పని చేయాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement