ఎరువు.. దరువు
● భారీగా పెరిగిన
కాంప్లెక్స్ ఎరువుల ధరలు
● బస్తాకు రూ.50 నుంచి
రూ.230 వరకు పెంపు
● రైతులపై రూ.12.40 కోట్ల
అదనపు భారం
● రబీ సీజన్లో 1.89 లక్షల
ఎకరాల్లో రబీ సాగు
● కృత్రిమ కొరతను సృష్టించి రేటు పెంచేసిన వ్యాపారులు
● ఇప్పటివరకూ
అన్నదాత సుఖీభవ అందని వైనం
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల
వైఖరితో రైతన్నల అవస్థలు
అధికారంలోకి వస్తే అండగా ఉంటామని రైతన్నలకు ఇచ్చిన హామీపై కూటమి ప్రభుత్వం ముఖం చాటేసింది. అధికారం చేపట్టిన వెంటనే అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు రూ.20 వేలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్న హామీని సైతం అటకెక్కించింది. దీంతో ఖరీఫ్ సాగు అంతగా కలిసిరాక ఇబ్బందులు పడుతున్న తరుణంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ఎరువుల ధరలు రైతుల పాలిట శాపంగా పరిణమించాయి. ఎరువుల ధరలు పెరుగుతున్నంత వేగంగా ధాన్యం ధరలు పెరగకపోవడంతో వ్యవసాయం దండగలా ఉందంటూ రైతులు నిట్టూరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment