కొబ్బరి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలి | - | Sakshi
Sakshi News home page

కొబ్బరి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలి

Published Wed, Jan 29 2025 12:14 AM | Last Updated on Wed, Jan 29 2025 12:14 AM

కొబ్బరి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలి

కొబ్బరి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలి

అయినవిల్లి: కొబ్బరి ఆధారిత పరిశ్రమల స్థాపనకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అన్నారు. మంగళవారం నేదునూరు గ్రామంలో కృషివల కొబ్బరి రైతుల ఉత్పత్తిదారుల కంపెనీని ఆయన సందర్శించారు. అక్కడి ఉత్పత్తులు, ఇతర వివరాలను కార్య నిర్వహణాధికారిని అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలో ఐదు కేజీల క్వాయర్‌ బ్రిక్స్‌ తయారీ, ఫైబర్‌ సేకరణ, వర్మీ కంపోస్ట్‌, హైటెక్‌ నర్సరీ యూనిట్లను కలెక్టర్‌ పరిశీలించారు. కొబ్బరికాయల డొక్కల నుంచి పీచు, పొట్టు తయారీ వంటి విధానాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కంపెనీకి జైక పరిశ్రమ నుంచి రావాల్సిన నిధులను త్వరలో విడుదల చేయించేందుకు కృషి చేస్తానన్నారు. ఉత్పత్తిదారుల సంఘాలు సమష్టిగా ఇటువంటి యూనిట్లను ఏర్పాటు చేసి, మరింత పురోగతి సాధించాలన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం అమలు చేస్తున్న స్ఫూర్తి పథకం ద్వారా సుమారు రూ.5 కోట్ల వ్యయంతో కొబ్బరి ముడి సరకుతో తయారయ్యే ఉత్పత్తుల పరిశ్రమ నెలకొల్పినట్టు జిల్లా ఉద్యాన అధికారి బీబీ రమణ కలెక్టర్‌కు వివరించారు. ఈ పెట్టుబడి వ్యయంలో 90 శాతం రాయితీని జిల్లా పరిశ్రమల కేంద్రం అందించిందన్నారు. దుబాయ్‌ వంటి ప్రాంతాల్లో మొక్కల పెంపకానికి మట్టికి బదులుగా కొబ్బరి పొట్టుతో తయారు చేసిన ఇటుకలను వినియోగిస్తారన్నారు. ఈ ఇటుకల ఎగుమతికి మంచి డిమాండ్‌ ఉందన్నారు. జియో టెక్స్‌టైల్‌ మ్యాట్లను రోడ్ల నిర్మాణంలో లేయర్ల మధ్య పటిష్టతకు వినియోగిస్తారన్నారు, కొబ్బరి తాళ్లు, బొమ్మల తయారీకి స్థానికంగా ముడి సరకు లభ్యమవుతుందన్నారు. ఉత్పత్తిదారుల కంపెనీ చైర్మన్‌ గణపతి వీరరాఘవులు, పరిశ్రమల కేంద్రం ప్రతినిధి మాధవి, సర్పంచ్‌ గుమ్మడి ప్రసాద్‌, రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ మహేష్‌కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement