రహదారి భద్రతపై బాధ్యత అవసరం
అమలాపురం రూరల్: సోషల్ మీడియాలో విద్యార్థులు ఎంత అవగాహనతో ఉంటున్నారో.. రహదారి భద్రతపై అంతే బాధ్యతగా ఉండాలని ఎంపీ గంటి హరీష్‌మాథుర్ బాలయోగి అన్నారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాకే వాహనాలు నడపాలని, హెల్మెట్ లేకుండా వాహనం నడపరాదని చెప్పారు. విద్యార్థులకు లైసెన్స్‌ల కోసం ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు అధికారులతో మాట్లాడతానన్నారు. డీటీఓ డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, లైసెన్స్ లేకుండా విద్యార్థులు వాహనం నడిపితే వారి తల్లిదండ్రులు శిక్షార్హులవుతారని హెచ్చరించారు. ఎంవీఐ ఓ.రవికుమార్, కళాశాల చైర్మన్ బోనం కృష్ణసతీష్, ప్రిన్సిపాల్ జీఎంవీ రామారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment