ఉత్సాహంగా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో సివిల్ సర్వీసెస్ ఆలిండియా హాకీ పోటీలు బుధవారం ఉత్సాహంగా జరిగాయి. పురుషుల విభాగంలో ఆర్‌ఎస్బీ భువనేశ్వర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌ఎస్బీ కొచ్చి జట్టు 5–0 స్కోర్‌తో, గోవా సెక్టార్‌తో జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 4–0 స్కోర్‌తో, ఆర్‌ఎస్బీ రాయ్‌పూర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌ఎస్బీ కాన్పూర్ 4–0 స్కోర్‌తో గెలుపొందాయి. ఢిల్లీ సెక్టార్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్యానా 0–1 స్కోర్‌తో విజయం సాధించింది. మహిళల విభాగంలో ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒడిశా 5–0 స్కోర్‌తో, బీహార్ సెక్టార్‌తో జరిగిన మ్యాచ్‌లో 3–2 స్కోర్‌తో హర్యానా సెక్టార్, తెలంగాణ సెక్టార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ సెక్టార్ 6–0 స్కోర్‌తో విజయం సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment