ఐ.పోలవరం: ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించి శారీరకంగా మోసం చేసిన కేసులో ఓ వ్యక్తికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. ఐదు వేల జరిమానాను రాజమహేంద్రవరం 8వ కోర్టు కం క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్‌కుమార్ కథనం ప్రకారం.. ఐ.పోలవరం మండలం పశువుల్లంక గ్రామానికి చెందిన బాధితురాలు 2019 నుంచి గ్రామంలో వలంటీరుగా పనిచేశారు. అదే సచివాలయంలో తాళ్లరేవు మండలం చిన గోవలంక గ్రామానికి చెందిన కాశి మధుబాబు వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేశారు. కాశి మధుబాబు బాధితురాలిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకొంటానని నమ్మబలికి మోసం చేశాడు. దీనిపై 2022 డిసెంబర్ 13న ఐ.పోలవరం పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై రాజమహేంద్రవరం ఉమెన్స్ కోర్టులో వాదనల అనంతరం జడ్జి వై.బెన్నయ్య నాయుడు పైవిధంగా తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment