ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రాలీ
ముగ్గురికి తీవ్ర గాయాలు
సీతానగరం: మండలంలోని వంగలపూడిలో ఏటిగట్టు పైనుంచి భారీ ట్రాలీ ఇంట్లోకి దూసుకు వెళ్లడంతో నిద్రిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలవరం ప్రాజెక్ట్ వద్దకు వెళ్తున్న ఖాళీగా భారీ ట్రాలీ గురువారం అర్ధరాత్రి 2.30 (తెల్లవారితే శుక్రవారం) గంటలకు వంగలపూడి ఏటిగట్టుపై నుంచి నేరుగా గట్టు ఆనుకుని ఉన్న చిట్రోతు వెంకటేశ్వరరావు తాటాకు ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంట్లో నిద్రిస్తున్న చిట్రోతు వెంకటేశ్వరరావు, అతని కుమార్తె దుర్గ, ఇద్దరు మనుమరాళ్లపై మట్టి గోడలు విరిగిపడ్డాయి. పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. మట్టిగోడల కింద ఉండి కేకలు వేస్తున్న నలుగురిని బయటకు తీసి కాపాడారు. అప్పటికే వెంకటేశ్వరరావు, కుమార్తె దుర్గ, మనుమరాలు పావనిలకు తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై డి.రామ్‌కుమార్ పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment