
పదిలో పట్టు.. భవితకు మెట్టు
రాయవరం: విద్యార్థి ప్రగతికి పదో తరగతి తొలి మెట్టు. పరీక్షలు అనగానే సహజంగానే విద్యార్థులు భయం, ఆందోళన చెందుతూ ఉంటారు. ఆ భయాన్ని వీడి పరీక్షలను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొంటే వారి భవిష్యత్ బంగారమవుతుంది. ఆత్మవిశ్వాసం..ఏకాగ్రత..మంచి ఆహారం..కొద్ది సేపు ధ్యానం అవసరం. సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
టెన్షన్ వద్దు
పరీక్షలు ప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్థులు టెన్షన్ వదిలి అటెన్షన్‌గా ఉండాలి. ప్రిపరేషన్ ఎంత అవసరమో దానిని పేపర్‌పై పెట్టగలగడమూ అంతే అవసరం. దానికి తోడు పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మనసు, శరీరమూ కూడా ప్రశాంతంగా ఉంటాయి. అలాగే పరీక్షలు రాసేముందు పునశ్చరణ ఉండాలే తప్ప కొత్త పాఠ్యాంశం జోలికి వెళ్లకూడదు.
ప్రజెంటేషన్ చాలా ముఖ్యం
పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు పాజిటివ్ థింకింగ్, ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రివ్యూ, ప్రజంటేషన్ అలవర్చుకోవాలి. వీటితో పాటు పరీక్ష ముందు రోజు తగినంత నిద్ర పోవాలి. నిద్ర మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. నేను బాగానే రాయగలను అనే పాజిటివ్ థింకింగ్‌తో పరీక్షా కేంద్రానికి వెళ్లాలి. ముందుగా బాగా వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాసి, తరువాత కష్టంగా అనిపించిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. రేపటి పరీక్షను చక్కగా రాస్తున్నట్లుగా ముందుగానే మనసును సిద్ధం చేయాలి. కొత్త వాతావరణంలో పరీక్షలు రాస్తున్నామనే భయం వద్దు. జవాబు పత్రంలో కొట్టివేతలు, దిద్దుబాట్లు లేకుండా, చక్కటి దస్తూరీతో సమాధానాలు రాస్తే మంచిది.
తల్లితండ్రుల పాత్ర కీలకం
పరీక్షల సమయంలో మంచి ర్యాంకు, ఎక్కువ మార్కు లు తెచ్చుకోవాలనే ఒత్తిడిని పిల్లలపై రుద్దకూడదు. ఇతరులతో పోల్చడం, గతంలో మార్కులు తక్కువ వచ్చిన అంశాలతో వారిని తక్కువ చేయకూడదు.
ఇవి పాటిస్తే మంచిది
జవాబు పత్రంలో ఒక్కో పేజీపై 16 నుంచి 18 లైన్లకు మించకుండా సమాధానాలు రాయాలి. ముఖ్యమైన అంశాల కింద అండర్‌లైన్ చేయాలి. గణితంలో అంకెలు స్పష్టంగా వేసుకోవాలి. తెలుగులో అక్షరాలు స్పష్టంగా కనబడేటట్లుగా రాయాలి. నీలం లేదా నలుపు రంగు సిరా ఉన్న పెన్నులు లేదా బాల్‌పెన్నులు మాత్రమే వాడాలి.
ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలి
ఆహార నియమాలతో మానసిక ప్రశాంతత
తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం
విద్యార్థులూ.. విజయానికి సూత్రాలివిగో..
Comments
Please login to add a commentAdd a comment