
ఉత్సాహంగా పవర్ లిఫ్టింగ్ పోటీలు
పి.గన్నవరం: పోతవరం గ్రామంలోని ఎస్‌ఎస్ ఫిట్‌నెస్ జోన్ ఆవరణలో శనివారం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ చాంపియన్, బెంచ్ ప్రెస్ 2025 పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. ఎస్‌ఎస్ ఫిట్‌జోన్ అధినేత, కార్యక్రమ నిర్వాహకుడు కత్తుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడం ద్వారా మంచి ఆరోగ్యం చేకూరుతుందన్నారు. పవర్ లిఫ్టింగ్, బ్రెంజి ప్రెస్‌లో రాణించి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఎస్‌ఎస్ ఫిట్‌నెస్ జోన్, కోనసీమ పవర్ లిప్టింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో సుమారు 150 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. 10 కేటగిరీల్లో పురుషులు, మహిళలకు పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విజేతలకు బహుమతులు, మెరిట్ సర్టిఫికెట్లు, పతకాలు, షీల్టులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుమల కృష్ణపద్మరాజు, కార్యదర్శి ఒంటెద్దు వెంకన్నాయుడు, ఈవెంట మేనేజర్ కంకిపాటి వెంకటేశ్వరరావు, ఎస్‌ఎస్ ఫిట్‌నెస్ అధినేత కత్తుల శ్రీనివాస్, దవులూరి వెంకట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment