
ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక
పెదవేగి: మండలంలోని విజయరాయి సీతారామ కల్యాణ మండపంలో శుక్రవారం కోకో రైతుల రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బొల్లు రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శిగా కె.శ్రీనివాస్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఎస్.గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బోళ్ల సుబ్బారావు (పశ్చిమగోదావరి), పానుగంటి అచ్యుతరామయ్య (ఏలూరు), ఉప్పుగంటి భాస్కరరావు (కోనసీమ), గుదిబండి బండి వీరారెడ్డి (ఏలూరు), మార్ని శ్రీనివాసరావు (తూర్పుగోదావరి) సహా య కార్యదర్శులుగా ఉప్పల కాశీ (తూర్పుగోదావరి), కొసరాజు రాధాకష్ణ (ఏలూరు), కొప్పిశెట్టి ఆనంద వెంకటప్రసాద్ (కోనసీమ), కోశాధికారిగా జాస్తి కాశీ బాబు (ఏలూరు) మరో 35 మందితో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. కోకో రైతుల సమస్యలను పరిష్కరించాలని 24, 25 తేదీల్లో కోకో సాగు చేస్తున్న అన్ని జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
ఆలిండియా సపక్ తక్రా పోటీల్లో ప్రతిభ
అమలాపురం టౌన్: ఆలిండియా పోలీస్ క్రీడా పోటీల్లో వరుసగా మూడోసారి పతకాలు సాధించిన యాండ్ర గౌతమ్‌ను ఎస్పీ బి.కృష్ణారావు తన కార్యాలయంలో శుక్రవారం అభినందించారు. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకూ హర్యానా రాష్ట్రం మడగడలో జరిగిన 73వ ఆలిండియా పోలీస్ క్రీడా పోటీల్లో వాలీబాల్ క్లస్టర్ క్రీడా విభాగం విభాగంలో గౌతమ్ కాంస్య పతకాన్ని సాధించారు. జిల్లాకు చెందిన 2108 బ్యాచ్‌కు చెందిన సివిల్ కానిస్టేబుల్ గౌతమ్ సపక్ తక్రా క్రీడలో నైపుణ్యం సాధించాడు. గౌతమ్ సపక్ తక్రా క్రీడలో రాణిస్తూ ఇప్పటి వరకూ మూడు కాంస్య పతకాలు సాధించడం అభినందనీయమని ఎస్పీ కృష్ణారావు అన్నారు. 2003లో పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లోజరిగిన, 2024లో మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగిన ఆలిండియా పోలీస్ క్రీడల్లో కాంస్య పతకాలు సాధించి ఇప్పుడు మరో కాంస్య పతకాన్ని కై వసం చేసుకోవడం విశేషమని ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు.
70 రకాల డ్రగ్స్ పట్టివేత
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డ్రగ్స్ కంట్రోల్, విజిలెన్స్, ఈగల్ టీం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 70 రకాల నార్కోటిక్ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు చేపట్టిన ఈ దాడుల్లో సుమారు రూ.3 లక్షలకు పైగా విలువైన మత్తు మందులను అధికారులు గుర్తించారు. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, రావులపాలెంతో పాటు పలు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. డ్రగ్స్ కంట్రోలర్ ఏడీ డి.నాగమణి, విజిలెన్స్ ఏఎస్పీ ఎం.స్నేహిత ఈ దాడుల్లో పాల్గొని అనధికారంగా విక్రయించిన మత్తుమందులతో పాటు, పలు రకాల ఔఽషధాలను గుర్తించారు. నార్కోటిక్ డ్రగ్స్ హోల్‌సేల్ దుకాణల నుంచి ఎటువంటి బిల్లులు లేకుండా నేరుగా రిటైల్ దుకాణాలకు అమ్మడం, వారు తిరిగి వినియోగదారులకు విక్రయించడం ఈ దాడుల్లో కనుగొన్నారు. డాక్టర్ చీటీ లేకుండా మందులు అమ్మడం, బిల్లులు లేకుండా అమ్మడం, కొనడం నేరాల కింద ఉమ్మడి తూర్పుగోదారి జిల్లా పరిధిలో 20 దుకాణాలపై కేసులు నమోదు చేశారు.
పోక్సో కేసులో ఐదేళ్ల జైలు
అయినవిల్లి: అయినవిల్లిలంక గ్రామ శివారు గాలితిప్పపేటకు చెందిన మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విఽధిస్తూ కాకినాడ పోక్సో కోర్టు జడ్జి ఓ.శ్రీదేవి శుక్రవారం తీర్పు వెలువరించినట్లు పి.గన్నవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆర్.రుద్రరాజు భీమరాజు, అయినవిల్లి ఎస్సై హరికోటి శాస్త్రి తెలిపారు. 2023 మే 11న అదే గ్రామానికి చెందిన 50 ఏళ్ల డెక్క రాంబాబు మూడేళ్ల బాలికకు చాక్లెట్ ఇస్తానని చెప్పి ఆశ చూపి మాయమాటలతో తన ఇంటిలోకి అఘాయిత్యం చేశాడు. బాలిక తల్లి అదే రోజు ఫిర్యాదు ఇవ్వగా అప్పటి ఎస్సై నాగేశ్వరరావు పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటి కొత్తపేట డీఎస్పీ కేవీరమణ దర్యాప్తు చేసి డెక్క రాంబాబును అరెస్టు చేసి కోర్టుకు అప్పగించారు. కాకినాడ పోక్సో కోర్టులో కేసు విచారణ జరగగా, పీపీ జి.వెంకటరత్నంబాబు ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో జడ్జి తీర్చు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక
Comments
Please login to add a commentAdd a comment