జగ్గంపేట: మోటారు సైకిల్‌ను వెనుక నుంచి కారు ఢీ కొన్న ప్రమాదంలో మంగళవారం ఒక వ్యక్తి మృతి చెందాడు. జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపిన వివరాల ప్రకారం జగ్గంపేట లారీ వర్కర్స్ అండ్ యాజమాన్య సంఘం కార్యదర్శిగా వున్న సిగిరెడ్డి రాంబాబు ఉదయం, జగ్గంపేట శివారు రామవరం వద్ద వున్న యూనియిన్ ఆఫీసుకు తన స్కూటీ పై వస్తున్నారు. ఈ నేపథ్యంలో వెనుక నుంచి విశాఖ వైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి రాంబాబును ఢీ కొనడంతో ఆయన తలకు తీవ్రగాయమై అక్కడికి అక్కడే మృతి చెందాడు. మృతుడికి కొడుకు, కూతురు వుండగా భార్య ఏడాది క్రితమే అనారోగ్యంతో మృతిచెందారు. మృతుడి కుమారుడు అశోక్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘునాథరావు తెలిపారు.