
కారు ఢీకొన్న ఘటనలో బాధితుడి మృతి
సామర్లకోట: హుస్సేన్‌పురంలోని వెంకట్రామ ఆయిల్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న గద్దె లక్ష్మణరావు (35) కాకినాడలోని ట్రస్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మైనర్లు కారు డ్రైవింగ్ చేయడంతో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటారు సైకిల్‌పై వేట్లపాలెం నుంచి కాకినాడ వెళుతున్న భార్యభర్తలు తీవ్రంగా గాయపడిన విషయం విధితమే. క్షతగాత్రులు గద్దె లక్ష్మణరావు, శిరీషలను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మణరావు మృతి చెందాడు. శిరీష పరిస్థితి కూడా విషమంగా ఉందని బంధువులు చెబుతున్నారు. లక్ష్మణరావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లక్ష్మణరావు మృతితో వేట్లపాలెం గాంధీనగర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
భార్య పరిస్థితి విషమం
వేట్లపాలెంలో విషాదఛాయలు