క్రీడాకారులను తయారుచేద్దామా? | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారులను తయారుచేద్దామా?

Apr 6 2025 12:17 AM | Updated on Apr 6 2025 12:17 AM

క్రీడ

క్రీడాకారులను తయారుచేద్దామా?

కోచ్‌ కావాలనుకునేవారి

నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఆరు వారాల పాటు శిక్షణ

ఇవ్వనున్న క్రీడాప్రాధికార సంస్ధ

ఈ నెల 14 తుది గడువు

నాగమల్లితోట జంక్షన్‌(కాకినాడ సిటి): క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించడమే కాదు.. ఆయా స్థాయిల్లో క్రీడాకారులను తయారు చేసేందుకు, వారికి తర్ఫీదు ఇచ్చేందుకు భారత క్రీడాప్రాధికార సంస్థ అవకాశం కల్పిస్తోంది. క్రీడా శిక్షకుడిగా ఎదగాలని, పిల్లలకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని భావిస్తున్న వారి కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ ఓ వేదికను ఏర్పాటు చేసింది. ఇది వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి చాలా మంది శిక్షణను పూర్తి చేసుకుని ధ్రువపత్రాలు సాధించారు. నేతాజీ సుభాష్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ ఆధ్వర్యంలో 23 క్రీడాంశాల్లో ఆరు వారాల సర్టిఫికెట్‌ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

ఇంటర్మీడియెట్‌, ఆపై..

ఇంటర్మీడియెట్‌, ఆపై ఉత్తీర్ణత సాధించి 20 నుంచి 42 ఏళ్లలోపు అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. జిల్లాస్థాయి చాంపియన్‌ షిప్‌ పోటీల్లో తొలి మూడు స్థానాలు, రాష్ట్ర స్థాయి ఆలిండియా, వర్సిటీ చాంపియన్‌ షిప్‌, జోనల్‌ ఇంటర్‌ యూనివర్శిటీ స్థాయి పోటీలలో ప్రాతినిధ్యం, ఎస్‌జీఎఫ్‌ జాతీయ స్థాయి పోటీలలో జూనియర్‌, సీనియర్‌ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఉండాలి.

ఏయే అంశాల్లో ....

సైక్లింగ్‌, క్రికెట్‌, ఫెన్సింగ్‌, ఫుట్‌బాల్‌, జిమ్నాస్టిక్స్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, జుడో, కబడ్డీ, ఖోఖో, రోయింగ్‌, సాఫ్ట్‌బాల్‌, షూటింగ్‌, స్విమ్మింగ్‌, తైక్వాండో, టేబుల్‌టెన్నిస్‌, లాన్‌ టెన్నిస్‌, వాలీబాల్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌, ఉషూ, యోఆ, త్రోబాల్‌ తదితర క్రీడాంశాలుంటాయి.

శిక్షణ కేంద్రాలు

క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడ ఆధారంగా శిక్షణ కేంద్రాన్ని కేటాయిస్తారు. వారు యూనిఫాంతో పాటు సాధారణ దుస్తులు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. పంజాబ్‌ రాష్ట్రం పటియాలా, కర్ణాటక రాజధాని బెంగళూరు, పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కత్తాలలో ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్‌ శిక్షణా కేంద్రాలు ఉన్నాయి.

మే 6 నుంచి జూలై 2 వరకు శిక్షణ...

ఆరు వారాల సర్టిఫికెట్‌ కోర్సులో 30 రోజులు థియరీ, 14 రోజులు ప్రాక్టికల్స్‌ ఉంటాయి. మే 6 నుంచి జూలై 2 వరకు ఎంపికై న అభ్యర్థులకు శిక్షణ ఉంటుంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ ఈనెల 14.

మంచి అవకాశం

క్రీడారంగంపై ఆసక్తి ఉన్న వారి కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ మంచి అవకాశం కల్పిస్తోంది. ఆరు వారాల పాటు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చి వారికి శిక్షకులుగా గుర్తింపు ఇవ్వనుంది. వివరాలకు 89196 42248 నెంబురులో సంప్రదించండి.

– శ్రీనివాస్‌ కుమార్‌, డీఎస్‌డీఓ

క్రీడాకారులను తయారుచేద్దామా? 1
1/1

క్రీడాకారులను తయారుచేద్దామా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement