గళమెత్తిన పోలవరం నిర్వాసితులు
వేలేరుపాడు: ఏటా గోదావరి వరదలకు గ్రామాలు నీటమునుగుతున్నాయి.. తాము సర్వస్యం కోల్పోతున్నాం.. అయినా ప్రభుత్వం తమ గ్రామాలను 45 కాంటూరులో చేర్చిందంటూ శుక్రవారం ని ర్వాసితులు ఆందోళనకు దిగారు. వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. మండలంలోని ఎర్రబోరు, సుద్దగుంపు, తాట్కూరు గొమ్ముకాలనీ, నడిమిగొమ్ము కాలనీ, పాతపూచిరా ల, పడమటిమెట్ట, చాగరపల్లి, కొర్రాజులగూడెం, గీగావారిగుంపు, మద్దిగట్ల తదితర గ్రామాల ప్రజలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. తహసీల్దార్ సత్యనారాయణ అందుబాటులో లేరని సిబ్బంది చెప్పడంతో తహసీల్దార్ కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లి అధికారులను దిగ్బంధనం చేశారు. ముందుగా చాగరపల్లి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆర్‌ఐ భుజంగరావుకు వినతి పత్రం అందజేశారు. తాట్కూరుగొమ్ము సర్పంచ్ కట్టి ఉదయ్‌కిరణ్, ఎంపీటీసీ కొమ్మరాజు రాంబా బు, వైఎస్సార్‌సీపీ నేత కామినేని వెంకటేశ్వరావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండీ మునీర్, కారం దారయ్య, నిర్వాసితులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment