నిరుద్యోగులకు ప్రభుత్వం మొండిచేయి
హ్యాండ్‌బాల్ విజేత సీఆర్‌ఆర్
జేఎన్‌టీయూకే అంతర్ కళాశాలల హ్యాండ్‌బాల్ పోటీల పురుషుల విభాగంలో ఏలూరు సీఆర్‌ఆర్ కళాశాల జట్టువిజయం సాధించింది. 8లో u
జంగారెడ్డిగూడెం: నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు అన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిక్కాల దుర్గాప్రసాద్ చేపట్టిన పాదయాత్ర శుక్రవారం జంగారెడ్డిగూడెం మండలం, పట్టణానికి చేరుకుంది. గురునాథరావుతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు ఆయనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గురునాథరావు మాట్లాడుతూ ఎ న్నికల్లో గెలిచేందుకు కూటమి నాయకులు హామీలు గుప్పించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేశారన్నారు. ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎ దురుచూస్తున్న నిరుద్యోగులకు మొండి చేయి ఎదురవుతోందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగభృతి ఇవ్వాలని, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాలని, సీపీఎస్ రద్దు చేయాలని, వలంటీర్ వ్యవస్థను పునరుద్ధించి రూ.10 వేలు వేతనం ఇవ్వాలని, ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్లకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చి హెల్త్‌కార్డులు ఇవ్వాలంటూ ఏలూ రు నుంచి కాకినాడ వరకు పాదయాత్ర చేస్తున్నట్టు చెప్పారు. నాయకుల ముప్పిడి శ్రీనివాసరావు, మంతెన సోమరాజు, జెట్టి ఆదిత్య, గంజిమాల రామారావు, గంటా శ్రీనివాసరావు త దితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో దుర్గాప్రసాద్ పాదయాత్రకు జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జి, నాయకులు రాఘవరాజు విష్ణు, మల్నీడి బాబి సంఘీభావం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment