కేసుల రాజీకి కృషి చేయాలి
ఏలూరు (టూటౌన్): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని రిటైర్డ్ న్యాయమూర్తులు, ఎంపిక చేసిన న్యాయవాదులు, సోషల్ వర్కర్లకు నిర్వహించిన మధ్యవర్తుల శిక్షణా తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్‌ఏసీ) ఎం.సునీల్‌కుమార్ మాట్లాడుతూ కేసుల త్వరితగతిన పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని, శిక్షణను సద్వినియోగం చేసుకుని కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కొన్ని కేసుల్లో అవగాహన లోపంతో రాజీపడటం లేదని, కౌన్సెలింగ్ ద్వారా కేసులను త్వరగా పరిష్కరించవచ్చన్నారు. రెండో అదనపు జిల్లా జడ్జి పి.మంగకుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం, జాతీయ న్యాయ అధికార సంస్థ, న్యూఢిల్లీ రిసోర్స్ పర్సన్ పుష్పగుప్తా, దీపక్ డింగరా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment