ఎస్సీ సర్పంచ్‌ల హక్కులకు భంగం
ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఎస్సీ సర్పంచుల హక్కులను కాలరాసేలా అధికారులు వేధిస్తున్నా రని ఎస్సీ సర్పంచ్‌ల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మెండెం సంతోష్‌కుమార్, కై కలూరు సర్పంచ్ దానం మేరీ నవనీత కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరులో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ చిన్నపాటి కారణాలతో వేధింపులు, చెక్ పవర్ రద్దు వంటి చర్యలకు పంచాయతీ అధికారులు పాల్పడటం సరికాదన్నారు. జిల్లాలో ఆరుగురు ఎస్సీ సర్పంచ్‌లపై వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. పంచాయతీ నిధులను ఒక ఖాతాకు బదులు వేరే ఖాతాకు వినియోగించిన కా రణంగా తన చెక్ పవర్ రద్దు చేశారని నవనీత కు మారి అన్నారు. డీఎల్‌పీఓ పూర్ణచంద్రశేఖర్ అడిగిన రూ.2 లక్షలు ఇవ్వనందుకే తన చెక్ పవర్‌ను రద్దు చేయాలని సిఫార్సు చేశారని ఆరోపించారు. తన చెక్ పవర్‌ను పునరుద్ధరించాలని, లేకుంటే న్యాయపోరాటానికి సిద్ధమని అన్నారు. సర్పంచ్‌లు బో దుల స్వరూప్, చిలకా సుబ్బారావు, ఎస్సీ నాయకు లు పాము మాన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment