అధినేతను కలిసిన అబ్బయ్యచౌదరి
దెందులూరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని లండన్‌లో గురువారం దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. దెందులూరు నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు.
నేటి నుంచి ఇంటర్ క్వాలిఫయింగ్ పరీక్షలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఈనెల 1, 3 తేదీల్లో క్వాలిఫయింగ్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.చంద్రశేఖర బాబు ఓ ప్రకటనలో తెలిపారు. 1న ఎథిక్స్, హ్యుమన్ వ్యాల్యూస్, 3న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు చదివే కాలేజీల్లోనే పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశామన్నారు. 137 కళాశాలల్లో 18,453 మంది వి ద్యార్థులు హాజరుకానున్నట్టు తెలిపారు. గతంలో ఈ పరీక్షలు రాయకున్నా, ఫెయిలైన విద్యార్థులు కూడా గత పరీక్షల హాల్‌టికెట్‌తో హాజరు కావచ్చని చెప్పారు.
భూసమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (టూటౌన్): ఏజెన్సీ ప్రాంతంలో భూ సమస్యలను పరిష్కరించాలని, బుట్టాయగూడెంలో గిరిజనుల గుడిసెలను పీకేసిన ప్రైవేట్ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ అధికారుల తప్పుడు ప్రొటెక్షన్ ఆర్డర్లను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ బృందం శుక్రవారం జేసీ పి.ధాత్రిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది. జిల్లా కార్యదర్శి ఎ.రవి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కె.శ్రీనివాస్, పి.రామకృష్ణ, డీఎన్‌వీడీ ప్రసాద్ తదితరులు సమస్యలను జేసీ దృష్టికి తీసుకువెళ్లారు.
డీన్ అకడమిక్‌గా చిరంజీవి
నూజివీడు: నూజివీడు ట్రిపుల్‌ఐటీ డీన్ అకడమిక్‌గా సీఎస్‌ఈ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ చిరంజీవి నియమితులయ్యారు. ఇప్పటివరకు పనిచేస్తున్న రత్నాకర్ పదవీ కాలం పూర్తికావడంతో చిరంజీవిని నియమించారు. శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. రత్నాకర్‌ను అధికారులు సత్కరించారు. ట్రిపుల్‌ఐటీలో ఈసీఈ విద్యార్థులు 80 మంది ఇండస్ట్ట్రీయల్ టూర్‌లో భాగంగా మంగళగిరి వద్ద ఉన్న ఎఫ్‌ట్రానిక్స్ కంపెనీని సందర్శించారు.
8 నుంచి నారసింహుని కల్యాణోత్సవాలు
ద్వారకాతిరుమల: చినవెంకన్న క్షేత్రానికి దత్తత ఆల యం మండలంలోని ఐఎస్ జగన్నాథపురంలో సుందరగిరిపై కొలువైన స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దివ్య కల్యాణ మహోత్సవాలు ఈనెల 8 నుంచి 13 వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ ఇన్‌చార్జి ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 8న ఉదయం 10.30 గంటలకు స్వా మి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా ముస్తాబు చేస్తారు. 10న ఉ దయం కొండ కింద కల్యాణ మండపంలో దివ్య కల్యాణోత్సవాన్ని జరిపిస్తారు. 11న సా యంత్రం గ్రా మోత్సవం, 12న పంచామృతాభిషేకాలు, చందనోత్సవం, పూర్ణాహుతి వేడు కలు జరుగుతాయి. 13న ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీ పు ష్ప యాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఈఓ తెలిపారు.
నేడు అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం రాక
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం శనివారం పరిశీలించనుంది. గియాన్ ఫ్రాన్ డి సిస్కో, డేవిడ్ బి పాల్‌తో కూడిన బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. కొత్త డయాఫ్రమ్‌వాల్ పనులపై సమావేశం నిర్వహిస్తారు. డయాఫ్రమ్‌వాల్‌తో పాటు నిర్మాణాల డిజైన్‌లు, పనుల నాణ్యతపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. డయాఫ్రమ్‌వాల్ నిర్మాణ పనులను పరిశీలించి కమిటీ, సీడబ్ల్యూసీ సభ్యులు భోపాల్ సింగ్‌కు తెలియజేస్తారని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment