Beauty Tips In Telugu: Best Home Remedies To Get Rid Of Pigmentation, Details Inside - Sakshi
Sakshi News home page

Pigmentation: బంగాళా దుంప, నిమ్మ రసం, తేనె.. పిగ్మెంటేషన్‌కు ఇలా చెక్‌!

Published Wed, Aug 31 2022 12:22 PM | Last Updated on Wed, Aug 31 2022 4:41 PM

Beauty Tips In Telugu: Home Remedies For Get Rid Of Pigmentation - Sakshi

Tips To Get Rid Of Pigmentation: రకరకాల కారణాల వల్ల ముఖంపై పిగ్మెంటేషన్‌ వస్తుంటుంది చాలామందికి. దానికి క్రీములు, ఇతర మందులు వాడే బదులు ఇలా చేసి చూస్తే సరి.. పిగ్మెంటేషన్‌ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

బంగాళా దుంపతో..
►బంగాళా దుంప, నిమ్మరసం.. ఒక బంగాళా దుంపని తురిమి అందులో పావు కప్పు నిమ్మరసం కలపండి.
►పిగ్మెంటేషన్‌ ఎక్కువగా ఉన్న చోట ఈ మాస్క్‌ని వేసుకుని అరగంట ఆగి చల్లని నీటితో కడిగేయాలి.
►ఇలా రోజుకి రెండుసార్లు చేయవచ్చు.

నిమ్మరసం, తేనె..
►రెండు టేబుల్‌ స్పూన్ల తేనెలో రెండు టేబుల్‌ స్పూన్ల నిమ్మరసం కలిపి  అవసరమున్న చోట ఈ మిశ్రమాన్ని పూతలా వేసుకోవాలి.
►తర్వాత గోరు వెచ్చని నీటిలో మెత్తటి బట్ట ముంచి పిండేయాలి.
►ఆ బట్టని ఈ మిశ్రమం అప్లై చేసిన చోట కవర్‌ చేసినట్లుగా వేయండి.
►ఇరవైనిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి.
►ఇలా వారానికి ఒకసారి చేయాలి.

యాపిల్‌ సిడర్‌ వెనిగర్‌..
►అర కప్పు యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ లో అర కప్పు నీరు కలపండి.
►పిగ్మెంటేషన్‌ ఉన్న చోట ఈ నీటిని పోయండి. నాలుగైదు నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి.
►ఇలా రోజుకి రెండు సార్లు నెల రోజుల పాటూ చేయండి.

పసుపు, పాలు..
►ఒక బౌల్‌లో ఐదారు టీ స్పూన్ల పసుపు తీసుకుని అందులో తగినంత పాలు పోసి మెత్తటి పేస్ట్‌ లా చేయండి.
►పిగ్మెంటేషన్‌ ఉన్నచోట ఈ పేస్ట్‌ అప్లై చేసి ఐదునిమిషాలు గుండ్రంగా మసాజ్‌ చేయండి.
►ఆరిన తరువాత  గోరు వెచ్చని నీటితో కడిగేయండి.
►రోజూ స్నానానికి ముందు ఒకసారి ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

చదవండి: Aloe Vera Gel Night Cream: అలోవెరా జెల్‌తో నైట్‌ క్రీమ్‌ ఇలా తయారు చేసుకోండి! రోజూ రాసుకుంటే..
Eye Stress Relief: ఎక్కువ సేపు కంప్యూటర్‌ స్క్రీన్‌ చూసేవాళ్లు! రోజ్‌వాటర్‌, టీ బ్యాగ్‌లు, పుదీనా.. ఈ చిట్కాలు పాటిస్తే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement