చూడ్డానికి చిట్టివే కానీ పోషకాల్లో గట్టివి! ముట్టుకుంటేనే జర్రు జారిపోయేలా ఉన్నా శరీరానికి మంచి పట్టునిస్తాయి. అవే ఆవాలు. ఆవాలు రుచికి మంచి పోషక, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
పురాతన కాలంనుంచి వీటికి ప్రాధాన్యత ఎక్కువే. ఆవాలు లేని పోపును అస్సలు ఊహించలేం. ఇక పచ్చళ్లలో, ఆవకాయల్లో ఆవాలు పాత్ర ఇంతా అంతాకాదు. చాలా రకాల కూరలు ఆవపిండితో కలిపి వండుతారు.
ఆవాలు-లాభాలు
ఆవాల్లో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉబ్బరం , అజీర్ణంతో బాధపడేవారు భోజనంలో ఆవపిండిని చేర్చుకోవచ్చు.
పొటాషియం, కాల్షియం ఎక్కువగా లభిస్తాయి. ఇవి ఎముకలు, కీళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
దగ్గు, జలుబు వంటి సమస్యలుకు ఉపశమనం లభిస్తుంది.
ఆవాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మంచి కొవ్వులు పెరుగుతాయి.
ఆవపిండిలో సెలీనియం అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఉబ్బసం లేదా శ్వాసకోశ సమస్యలకు, శ్వాసకోశంలో మంట నివారణకు ఉపయోగపడుతుంది.
ఆవాల్లోని రిచ్ న్యూట్రియెంట్స్ చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా జుట్టుని బలంగా చేస్తాయి. ఇందులోని విటమిన్ ఎ, కె, సిలు.. వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలు, ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తాయి.
ఆవపిండిలో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలున్నాయి. అలాగే ఇందులోని సల్ఫర్ మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు మంచిది.
సోరియాసిస్, ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్, రింగ్ వార్మ్ వంటి సమస్యలు రాకుండా చేస్తాయి
కేన్సర్‌కు చెక్ చెప్పే గుణాలు కూడా ఆవాల్లో ఉన్నాయి. ఆవనూనె కూడా చాలా రకాల ఔషధ ప్రయోజనాలకోసం వాడతారు. ఆవాల నూనెను పూయడం వల్ల గాయాలు వేగంగా నయం అవుతాయి.
ఆహారంలో ఎలా చేర్చుకోవాలి
ఆవ కూరను తినవచ్చు. ఆవపొడిరూపంలో గానీ, గింజలుగా గానీ రోజూ కూరల్లో వాడు కోవచ్చు. ఆవనూనెను కూరగాయలను వేయించడానికి, మాంసం లేదా చేపల వంటకాల్లో లేదా సలాడ్‌లపై చల్లుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment