Best Capsicum Recipes: How To Prepare Tasty Capsicum Rings In Telugu - Sakshi
Sakshi News home page

Capsicum Rings Recipe: రుచికరమైన క్యాప్సికమ్‌ రింగ్స్‌ తయారీ ఇలా!

Published Thu, Jul 28 2022 2:46 PM | Last Updated on Thu, Jul 28 2022 4:28 PM

Recipes In Telugu: How To Prepare Tasty Capsicum Rings - Sakshi

ఆనియన్‌ రింగ్స్‌ బోర్‌ కొడితే ఈసారి ఇలా క్యాప్సికమ్‌  రింగ్స్‌ ట్రై చేయండి!
కావలసినవి:  
►క్యాప్సికమ్‌ – 3 (గుండ్రంగా చక్రాల్లా కట్‌ చేసుకోవాలి)
►శనగపిండి – 1 కప్పు
►బియ్యప్పిండి, కారం – 1 టేబుల్‌ స్పూన్‌ చొప్పున

►ఉప్పు – తగినంత, బేకింగ్‌ సోడా – పావు టేబుల్‌ స్పూన్‌
►అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ – పావు టీ స్పూన్, నీళ్లు – సరిపడా
►నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ:
►ముందుగా ఒక బౌల్‌ తీసుకోవాలి.
►అందులో శనగపిండి, బియ్యప్పిండి, కారం, తగినంత ఉప్పు వేయాలి.
►అదే విధంగా బేకింగ్‌ సోడా, అల్లం–వెల్లుల్లి పేస్ట్‌.. వేసుకుని బాగా కలిపాలి.
►కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ తోపులా చేసుకోవాలి.

►అందులో క్యాప్సికమ్‌ ముక్కల్ని బాగా ముంచి.. కాగుతున్న నూనెలో దోరగా వేయించుకోవాలి.
►వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్‌ చేసుకోవాలి.
►టొమాటో సాస్‌ లేదా చట్నీల్లో ఈ రింగ్స్‌ భలే రుచిగా ఉంటాయి. 
ఇవి కూడా ట్రై చేయండి: Chicken Omelette Recipe: చికెన్‌ ఆమ్లెట్‌ తయారీ విధానం ఇలా!
Masala French Toast Recipe: ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌.. మసాలా ఫ్రెంచ్‌ టోస్ట్‌ ఇలా తయారు చేసుకోం‍డి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement