Sankranti 2023 Special Recipes: How To Prepare Venna Murukulu And Nuvvula Undalu Recipes In Telugu - Sakshi
Sakshi News home page

Venna Murukulu: వెన్న మురుకులు, నువ్వుల ఉండలు.. ఇంట్లోనే ఇలా ఈజీగా!

Published Mon, Jan 16 2023 12:12 PM | Last Updated on Mon, Jan 16 2023 12:32 PM

Sankranti 2023 Special: Venna Murukulu Nuvvula Undalu Recipes - Sakshi

వెన్న మురుకులు, నువ్వుల ఉండలు

Venna Murukulu And Nuvvula Undalu Recipes In Telugu: వెన్న మురుకులు, నువ్వుల ఉండలు ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి
కావలసినవి:
►బియ్యప్పిండి – అర కేజీ
►శనగపిండి – పావు కేజీ
►వెన్న – పావు కేజీ

►ఉప్పు – 2 టీ స్పూన్‌లు లేదా రుచికి తగినంత
►జీలకర్ర పొడి – టీ స్పూన్‌
►ఇంగువ – అర స్పూన్‌
►వేడి నీరు – అర లీటరు
►నూనె – అర కేజీ.

తయారీ:
►బియ్యప్పిండి, శనగపిండిని కలిపి జల్లించాలి.
►ఇందులో వెన్న వేసి సమంగా కలిసే వరకు వేళ్లతో మర్దన చేస్తూ కలపాలి.
►ఇప్పుడు ఉప్పు, జీలకర్ర పొడి, ఇంగువ వేసి మరోసారి కలపాలి.

►ఇందులో వేడినీటిని పోసి ముద్దగా కలుపుకోవాలి.
►మురుకుల గొట్టంలో వేసి ఒకసారి వత్తుకుని చూసుకోవాలి.
►తీగ సరిగ్గా పడకుండా మధ్యలో విరిగిపోతుంటే పిండి మీద కొద్దిగా నీటిని చిలకరించి కలుపుకోవాలి.

►బాణలిలో నూనె వేడి చేసి పిండిని మురుకుల గొట్టంలో వేసుకుని నూనెలోకి వత్తుకోవాలి.
►దోరగా కాలిన తరవాత చిల్లుల గరిటెతో తీసుకోవాలి. పిండినంతటినీ ఇలాగే చేసుకోవాలి.
►ఈ మురుకులు రెండు వారాల వరకు తాజాగా ఉంటాయి. 

నువ్వుల ఉండలు
కావలసినవి:
►నువ్వులు – పావు కేజి
►బెల్లం పొడి – 200 గ్రా;
►ఏలకుల పొడి – ఒక టీ స్పూను
►నెయ్యి – కొద్దిగా.

తయారీ:
►నువ్వులను వేయించి పొడి చేయాలి.
►కొన్నింటిని పొడి చేయకుండా అలాగే ఉంచాలి.
►ఇందులో బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి రెండూ సమంగా కలిసే వరకు రోట్లో దంచాలి.
►చేతికి నెయ్యి రాసుకుని కావలసిన సైజులో ఉండలు చేయాలి.

►ఇవి రెండు–మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి.
►బెల్లం పాకం పట్టి నువ్వులు కలిపి ఉండలు చేసుకుంటే నెల వరకు తాజాగా ఉంటాయి.
గమనిక: తెల్ల నువ్వులు కాని నల్ల నువ్వులు కాని వాడవచ్చు. నల్ల నువ్వులైతే వేయించిన తర్వాత కాస్త నలిపి పొట్టు వదిలించాలి.

ఇవి కూడా ట్రై చేయండి: Best Sweet Recipe: ఎప్పుడూ సేమ్యా పాయసమేనా? ఈసారి... శనగపప్పు పాయసం ఇలా..
Capsicum Bajji Recipe: రుచికరమైన క్యాప్సికమ్‌ బజ్జీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement