అత్యంత పురాతన కలప వస్తువు! | Worlds Oldest Wooden Structure Found In Zambia | Sakshi
Sakshi News home page

అత్యంత పురాతన కలప వస్తువు!

Published Sun, Oct 8 2023 11:38 AM | Last Updated on Sun, Oct 8 2023 11:38 AM

Worlds Oldest Wooden Structure Found In Zambia - Sakshi

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కలప వస్తువును పురాతత్త్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రెండు కలప దుంగలను చెక్కి, రెండింటినీ ఒకదానికొకటి అనుసంధానం చేసి తయారు చేసిన ఈ వస్తువు నాగలిలాగానే కనిపిస్తోంది. జాంబియాలోని కలాంబో జలపాతం దిగువన ఇటీవల తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఇది బయటపడింది. ఈ వస్తువులోని రెండు కలప దుంగలనూ పదునైన పరికరాలతో చెక్కిన ఆనవాళ్లు కూడా స్పష్టంగా ఉన్నాయి.

ఇది దాదాపు 4.76 లక్షల ఏళ్ల కిందటిదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనిబట్టి ఆ కాలంలోనే మనుషులకు కలప వస్తువులను తయారు చేసే నైపుణ్యం ఉందని తెలుస్తోందని చెబుతున్నారు. ఇది రాతియుగం తొలినాళ్లకు చెందినదని, అప్పట్లోనే మనుషులు పనిముట్లను తయారు చేసుకునే వారని చెప్పేందుకు ఇది తిరుగులేని ఆధారమని శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన లివర్‌పూల్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ ల్యారీ బర్‌హామ్‌ తెలిపారు. ఈ వస్తువు కాలాన్ని నిర్ధారించిన పద్ధతులను, వాటి వివరాలను ‘నేచర్‌’ జర్నల్‌లో ప్రచురించారు. 

(చదవండి: అదొక శాపగ్రస్త గ్రామం! అరవై ఏళ్లుగా మనుషులే లేని ఊరు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement