ఎంత వేసవైనా ఇంత వేడేమిటి! | Dinesh C Sharma Article on High Temperature Record After 122 Years in India | Sakshi
Sakshi News home page

ఎంత వేసవైనా ఇంత వేడేమిటి!

Published Sat, May 7 2022 12:20 AM | Last Updated on Sat, May 7 2022 12:21 AM

Dinesh C Sharma Article on High Temperature Record After 122 Years in India - Sakshi

మార్చి నెలంటే మనకు వేసవి కాలమేమీ కాదు. కానీ ఈ ఏడాది మార్చిలో 122 ఏళ్ల నాటి రికార్డు స్థాయి అత్యధిక ఉష్ణోగ్రతలు దేశంలో నమోద య్యాయి! ఇప్పుడు మార్చిలో లేము. ఏప్రిల్‌ నెలనూ దాటేసి, మే లోకి ప్రవేశించాం. దేశంలోని అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరుకుం టోంది. మనుషులు, పశుపక్ష్యాదులు, పంటలు, వ్యాపారాలపై వేడిమి తన ప్రభావాన్ని చూపిస్తోంది. వడగాలులు ఈడ్చి కొడుతున్నాయి. పెరిగిన వేడిమి కారణంగా విద్యుత్‌కు ఎక్కువ డిమాండ్‌ ఏర్పడింది. ఫలితంగా విద్యుత్‌ కోతలు అనివార్యం అవుతున్నాయి. వేసవి ఇలానే ఉంటుందని అనుకోవడం పొరపాటు. వేసవి వేరు, వేసవి వేడి పెరగడం వేరు. ఈ సమస్య పరిష్కారానికి నిర్మాణాత్మకమైన ప్రభుత్వ విధాన ప్రతిస్పందన అవసరం. 

గత కొద్ది రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో... ముఖ్యంగా వాయవ్య, మధ్య, తూర్పు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలకు పెరిగింది. కొన్ని జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు  45–50 సెల్సియస్‌ డిగ్రీల మధ్య కూడా ఉంటూ అత్యుష్ణ ప్రాంత పరిస్థితుల్ని తలపిస్తున్నాయి. వాయవ్య, మధ్య భారతదేశంలో మహోగ్రమైన వేసవి కాలాలు కొత్తవేమీ కాదు. అయితే వేసవి కాల ప్రారంభ వారాల్లోనే ఉష్ణోగ్రత మితిమీరి పెరగడం, దానికి దీర్ఘకాల పొyì  వాతావరణం తోడవటం ఆందోళనకరంగా పరిణమించింది.

పెరిగిన వేడిమి కారణంగా విద్యుత్‌కు ఎక్కువ డిమాండ్‌ ఏర్ప డింది. ఫలితంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలు అని వార్యం అవుతున్నాయి. ఇందుకు కారణం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రా లకు బొగ్గు సరఫరాలో తలెత్తుతున్న సమస్యలేనని చెబుతున్నారు. మహా నగరాల్లో ఇప్పటికే కూలర్లు, ఎయిర్‌ కండిషనర్ల కొరత; చిన్న నగ రాలు, పట్టణాలలో నీటి ఎద్దడి మొదలైంది. అయితే వీటన్నిటినీ వేసవికాల సాధారణ పరిణామాలుగా పరిగణించడం తప్పు. వేసవి వేరు, వేసవి వేడి పెరగడం వేరు. అధికమౌతున్న ఉష్ణోగ్రత మానవ ఆరోగ్యానికి, పశుగణానికి, ఇతర జీవ రాశులకు, పంటలకు, వ్యాపా రాలకు ముప్పు తెచ్చిపెడుతుంది. ఈ సమస్య పరిష్కారానికి నిర్మాణా త్మకమైన ప్రభుత్వ విధాన ప్రతిస్పందన అవసరం. 

ఉష్ణ దీవులుగా పట్టణాలు!
తొలి అడుగుగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న విజ్ఞాన శాస్త్రాన్నీ, మున్ముందు అందుబాటులోకి రానున్న ఏకాభిప్రాయ శాస్త్ర పరిజ్ఞా నాన్నీ స్వీకరించడం. వాతావరణ మార్పులపై ఏర్పాటైన ఐ.పి.సి.సి. (ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌) దేశంలోని అన్ని ప్రాంతాలలో వడగాలుల విస్తృతి, తీవ్రత పెరుగుతోందనీ; వేసవులు దీర్ఘంగా, శీతాకాలాలు చిన్నవిగా మారబోతాయనీ అదే పనిగా హెచ్చరిస్తూ వస్తోంది. భూతాప స్థాయి 2 సెల్సియస్‌ డిగ్రీలకు చేరుకున్నప్పుడు ఉష్ణోగ్రతలు మానవ ఆరోగ్యానికి, వ్యవసా యానికి ఉండే సహన పరిమితులను చేరుకుంటాయని చివరిసారిగా గత ఏడాది ఆగస్టులో విడుదల చేసిన నివేదికలో ఐ.పి.సి.సి. అప్రమత్తం చేసింది. భూతాపం వల్ల ఉష్ణ వ్యవస్థలో సంభవించే మార్పుల ప్రభా వంతో సముద్రపు ఆమ్లీకరణ పెరిగి, ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గుతాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ దేశాల్లో ఉష్ణస్థితుల సమాచా రాన్ని బట్టి చూస్తే పట్టణ ప్రాంతాలలో తీవ్ర తరమౌతున్న వడగా లులు ఆ ప్రాంతాలను ఉష్ణ దీవులుగా మార్చే ప్రమాదం కనిపిస్తోం దని ఐ.పి.సి.సి. ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణంలోని మార్పు లను అంచనా వేస్తుండే ‘ఇండియన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ క్లైమేట్‌ చేంజ్‌ అసెస్‌మెంట్‌’ సంస్థ లెక్కల ప్రకారం వార్షిక సగటు ఉపరితల వాయు ఉష్ణోగ్రత పెరుగుదల 1.7–2 సెల్సియస్‌ డిగ్రీల మధ్య ఉంటోంది. వాతావరణ మార్పులపై శాస్త్ర అధ్యయనాలు, ఉష్ణోగ్రతల తీవ్రత సహా, ఇతర వాతావారణ మార్పులపై శాస్త్ర అధ్యయనాల వెల్లడిం పులు స్పష్టంగానే ఉన్నాయి. ప్రతి వడగాలినీ వాతావరణ మార్పు లకు ఆపాదించి చూడటానికి ‘ఆపాదన శాస్త్రం’ (ఆట్రిబ్యూషన్‌ సైన్స్‌) మరింతగా అభివృద్ధి చెందవలసి ఉంది. అయితే మానవ ప్రమేయం వల్ల సంభవించే వాతావరణ మార్పులకూ... తీవ్ర ఉష్ణోగ్రతలు,  వడగాలుల ఉద్ధృత దశలకూ సంబంధం ఉంటుందని చెప్పేందుకు ఎలాంటి ఆపాదింపుల అవసరం ఉండదు. 

ఉష్ణ హానికి చేరువలో పేదలు
రెండో అడుగు, వడగాలుల ప్రతికూల ప్రభావానికి గురయ్యే జన సమూహాలను గుర్తించడం, ఆ సమూహాలను కాపాడేందుకు అవస రమైన రక్షణ చర్యలను తక్షణం చేపట్టడం. దేశంలో ప్రస్తుతం వడ గాలులు వీస్తున్న రాష్ట్రాలు, జిల్లాల దుర్బలత్వ ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించి చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఇందుకు సహాయపడే నమూనా ఒకటి.. కొన్ని ప్రాజెక్ట్‌ల రూపంలో ఇప్పటికే అందుబాటులో ఉంది. ఉదాహరణకు, భువనేశ్వర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఐ.ఐ.పి.హెచ్‌.) ఒడిశాలో జరిపిన ఒక అధ్యయనంలో – మురికివాడల్లో నివసించే ప్రజల గృహ నిర్మాణ పద్ధతి, పైకప్పులో ఉష్ణాన్ని ఒడిసిపట్టేందుకు ఉపయోగించే ఆస్బె స్టాస్, తగరం వంటి పదార్థాలు, అవాసాల రద్దీ; విద్యుత్, నీటి సరఫరా లేకపోవడం, వంట సమయంలో అదనపు వేడి వెలువడటం వంటి కారణాలతో ఉష్ణ్రోగ్రత దుష్ప్రభావాలకు గురవుతున్నారని స్పష్టమయింది. ఆ క్రితం గుజరాత్‌లో గాంధీనగర్‌లోని ఐ.ఐ.పి.హెచ్‌. చేసిన అధ్యయనం కూడా ఉష్ణోగ్రతలకు తేలిగ్గా లోనయ్యే దుర్బల ప్రదేశాలలో తీసుకోవలసిన జాగ్రత్తల్ని సూచించింది. ప్రస్తుతం దేశంలోని 640 జిల్లాల్లో 10 జిల్లాలు ఉష్ణోగ్రతల రీత్యా ‘మిక్కిలి ప్రమాదం’లో ఉన్నాయనీ, మరో 97 జిల్లాలు ‘అత్యధిక ప్రమాదం’లో ఉన్నాయనీ ఐ.ఐ.పి.హెచ్‌. నిర్ధారించింది. ఈ ప్రమాదభరిత ప్రదేశా లన్నీ ఎక్కువ భాగం మధ్య భారతదేశంలోనే ఉన్నాయి. 

బయటి ఉష్ణోగ్రతను నిర్ణయించే భౌగోళికత, వృక్ష సంపద, గాలి వేగం మొదలైనవాటిని; మానవ ఆవాసాలలో లోపలి ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే వెంటిలేషన్, రూఫింగ్‌ వంటి అంశాలను పరిగణన లోకి తీసుకుని దుర్బలత్వాన్ని అంచనా వేయడం జరగుతుంది. నగరాల్లో కొన్ని ప్రాంతాలు అక్కడే ఉన్న మరికొన్ని ప్రాంతాల కన్నా అత్యధిక ఉష్ణోగ్రతల్ని కలిగి ఉండొచ్చు. ఉష్ణహానిని తగ్గించడానికి అటువంటి వేడి ప్రదేశాలన్నిటినీ గుర్తించాలి. వేడి ఒత్తిడిని అనుభవిం చేది కేవలం మనుషులే కాదు. పంటలు, పశువులు కూడా ప్రతి కూలంగా ప్రభావితమవుతాయి. వేడి ఒత్తిడి పాల ఉత్పత్తిని కూడా దెబ్బతీస్తోంది. 

చల్లబడిన ‘హీట్‌ యాక్షన్‌ ప్లాన్‌’!
వాతావరణ మార్పులపై దాదాపు 15 సంవత్సరాలుగా అమలులో ఉన్న జాతీయ, రాష్ట్ర ప్రణాళికలు.. తీవ్ర ఉష్ణోగ్రతల్ని మానవాళి ఎదు ర్కొంటున్న సవాళ్లలో ఒకటిగా పేర్కొన్నప్పటికీ.. వాటి వల్ల కని పిస్తున్న మార్పేమీ ఉండటం లేదు. కొన్ని నగరాల మునిసిపాలిటీలు ‘హీట్‌ యాక్షన్‌ ప్లాన్‌’లను సిద్ధం చేయడానికి చొరవ తీసుకున్నప్పటికీ అమలులో జాప్యం జరిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గత సంవ త్సరం వేడి సంబంధిత వ్యాధులపై జాతీయ కార్యాచరణను రూపొం దించింది. ఉష్ణోగ్రత వల్ల సంభవిస్తున్న అనారోగ్యాలను నమోదు చేసి, వాటిని సమగ్ర వ్యాధుల నిఘా కార్యక్రమానికి నివేదించాలని రాష్ట్రాలను కోరింది. అయినప్పటికీ, అంతర్‌వ్యూహ ఉష్ణ స్థితిస్థాపకత విధానం అంటూ ఏర్పడలేదు. మధ్యస్థ, దీర్ఘకాలిక చర్యలను స్పష్టంగా వివరించే జాతీయ ఉష్ణమాపక కార్య ప్రణాళిక కూడా లోపించింది. వేడి ప్రభావాలను తగ్గించడానికి కొత్త

సాంకేతికతల్ని, పరిష్కారా
లను అభివృద్ధి చేయడానికి మనకొక లక్ష్య సాధన వ్యూహం నేటి తక్షణావసరం. వడగాలుల అంచనాలు, హెచ్చరికలపై సమాచారాన్ని సుల భంగా అర్థమయ్యే రీతిలో, భాషలో మనం ప్రజలకు చేర్చాలి. నిర్మాణ, గ్రామీణ ఉపాధి, విద్యాసంస్థలు వంటి నిర్దిష్ట రంగాలలో సాధారణ ప్రజలకు, సంస్థల యజమానులకు వారు చేయవలసిన పనుల జాబితాలను సిద్ధం చేసి ప్రభుత్వం తగిన ప్రచారం కల్పిం చాలి. పైకప్పులను పెయింటింగ్‌ చేయడం లేదా రూఫింగ్‌ కోసం వేడి–శోషక పదార్థాల వాడకాన్ని నివారించడం, గాలి తేలిగ్గా చొరబడి వీచేలా క్రాస్‌–వెంటిలేషన్‌ కోసం కిటికీలను అమర్చడం వంటి సాధారణ పరిష్కారాలు ఆవాసాల లోపలి ఉష్ణోగ్రతలను తగ్గించ గలవు. ఈ తరహా పరిష్కారాలను పునరావృతం చేయడంలో స్థానిక సమూహాలు, పౌర సమాజాన్ని నిమగ్నం అయ్యేలా చేయగలిగితే ఉష్ణాన్ని నియంత్రించే లక్ష్యానికి మనం చాలా దగ్గరికి వెళ్లొచ్చు. 

వ్యాసకర్త: దినేశ్‌ సి. శర్మ 
 విజ్ఞానశాస్త్ర వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement