కాసులు కురిపిస్తున్న అక్రమ లేఅవుట్‌లు
గురువారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
జీజీహెచ్‌లో పోస్టుల భర్తీకి చర్యలు
గుంటూరు మెడికల్ : గుంటూరు జీజీహెచ్‌లో అత్యవసర వైద్య సేవలు రోగులకు అందించేందుకు ఖాళీగా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర యశస్వి రమణ తెలిపారు. ‘సాక్షి’లో బుధవారం ‘అత్యవసరం ... అత్తెసరే..! శీర్షికతో ట్రామాకేర్ సెంటర్‌లో ఖాళీ పోస్టుల గురించి, క్యాజువాల్టీ, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో సకాలంలో వైద్య సేవలు అందకపోవడంతో రోగులు పడుతున్న బాధల గురించి కథనం ప్రచురితమైంది. దీనిపై సూపరింటెండెంట్ స్పందించారు. పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులను అనుమతి కోరుతామన్నారు. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్‌ను ఆధునికీకరించి వారం రోజుల్లోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ విభాగంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
టెన్త్ విద్యార్థుల వివరాలు సవరణకు అవకాశం
గుంటూరు ఎడ్యుకేషన్: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థుల హాల్ టిక్కెట్లలో తప్పులు దొర్లకుండా వివరాలను సరి చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని యాజమాన్యాల్లోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంబంధిత పాఠశాల రికార్డులతోపాటు, అపార్ ఐడీని అనుసరించి ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు తమ లాగిన్ ద్వారా సరి చేసుకోవాలని సూచించారు. విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ సవరణ, ప్రథమ, ద్వితీయ భాషల ఎంపిక, మీడియం, అంగ వైకల్యం, ఓఎస్సెస్సీ సబ్జెక్టులు, కోడ్ ఆఫ్ స్టూడెంట్స్, టెన్త్ పరీక్షల ఒకేషనల్ సబ్జెక్టులు, పుట్టుమచ్చలు, విద్యార్థి ఫొటో, సంతకానికి సంబంధించి ఇటీవల సమర్పించిన నామినల్ రోల్స్‌లో తేడా ఉన్నట్లయితే సవరణ చేసి, హాల్ టిక్కెట్లలో తప్పిదాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వినుకొండ(నూజెండ్ల): కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు పెనుగొండ లక్ష్మీనారాయణ ఎంపిక కావడంపై వినుకొండ ప్రాంతంలో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన స్నేహితులు, పాతచెరుకుంపాలెం గ్రామస్తులు ఈ అవార్డు తమ గ్రామానికి దక్కినట్టుగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1954లో పాత చెరుకుంపాలెం గ్రామంలో గోవిందరెడ్డి, లింగమ్మ దంపతులకు రెండో సంతానంగా లక్ష్మీనారాయణ జన్మించారు. తండ్రి అదే గ్రామంలో బ్రాంచ్ పోస్టు మాస్టారుగా, గ్రామ మునసబుగా సేవలందించారు.
విద్యాభ్యాసం
1 నుంచి ఐదో తరగతి వరకూ చెరుకుంపాలెంలోనే లక్ష్మీనారాయణ ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. తరువాత 6 నుంచి 10వ తరగతి వరకూ ఫిరంగిపురంలోని సెయింట్ పాల్ ఉన్నత పాఠశాలలో చదివారు. ఇంటర్ వినుకొండ ప్రభుత్వ కళాశాలలో, ఉన్నత చదువులు గుంటూరులో పూర్తిచేశారు.
మాజీ ఎమ్మెల్యే ప్రోత్సాహంతో..
వినుకొండ మాజీ ఎమ్మెల్యే పులుపుల వెంకట శివయ్య ప్రోత్సాహంతో సాహిత్యం వైపు అడుగులు వేసి అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా సేవలు అందించారు. ప్రస్తుతం అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా సేవలందిస్తున్నారు. ఈ సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్న తొలి తెలుగు వాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించింది. ప్రస్తుతం లక్ష్మీనారాయణ గుంటూరులో స్థిరపడ్డారు. ఆయన రచించిన సాహిత్య వ్యాస సంపుటి దీపికకు ఈ అవార్డు లభించడం విశేషం.
చెరుకుంపాలెంలో లక్ష్మీనారాయణ నివసించిన ఇల్లు
●
కలిసి చదువుకున్నాం
లక్ష్మీనారాయణ, నేను కలిసి చదువుకున్నాం. చిన్నతనం నుంచి చురుకుగా ఉండే లక్ష్మీనారాయణ సాహిత్య అకాడమీ అవార్డు అందుకోవడం మా గ్రామానికే గర్వకారణం. ఉన్నత చదువులు చదువుకుని అవార్డు అందుకోవడం అందరికీ ఆదర్శం.
– సూరెనాసర్‌రెడ్డి, పాతచెరుకుంపాలెం
న్యూస్‌రీల్
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక లక్ష్మీనారాయణ స్వగ్రామం పాతచెరుకుంపాలెం గ్రామస్తుల హర్షాతిరేకాలు
డబ్బు ఇస్తే ఉద్యోగాలిప్పిస్తామని వల కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పోస్టులే ఎర ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల్లో వసూలు కింది స్థాయి ఉద్యోగులదే కీలక పాత్ర
Comments
Please login to add a commentAdd a comment