అంగన్‌వాడీ కేంద్రంలో హాజరు మాయ
ప్రత్తిపాడు: అంగన్‌వాడీ కేంద్రాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. సెక్టార్ సూపర్‌వైజర్లు కేంద్రాలకు చుట్టం చూపుగా తనిఖీలకు వెళుతుండటంతో అంగన్‌వాడీ కార్యకర్తలు కేంద్రాలకు వచ్చే చిన్నారుల హాజరును ఇష్టానుసారంగా నమోదు చేస్తున్నారు. బోగస్ హాజరు వేస్తూ విధుల్లో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అందుకు నిలువెత్తు సాక్ష్యమే ఈ చిత్రాలు. ప్రత్తిపాడు మండలం యనమదల మెయిన్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో నలుగురే నలుగురు చిన్నారులు ఉన్నారు. అంగన్‌వాడీ కార్యకర్త మాత్రం రిజిస్టర్‌లో ఏకంగా పద్నాలుగు మంది 18వ తేదీన కేంద్రానికి హాజరైనట్లు అటెండెన్స్ రిజిస్టర్‌లో హాజరు వేసేశారు. ఇదేమని అంగన్‌వాడీ కార్యకర్తను ‘సాక్షి’ అడగ్గా.. పది మంది చిన్నారులు వచ్చారని, అందులో నలుగురు ఇప్పుడు ఉన్నారని, మిగిలిన వారు అన్నం తిని వెళ్లిపోయారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment