ఎన్నికల నియమావళిపై అవగాహన ముఖ్యం
లక్ష్మీపురం: ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నియమావళిపై అవగాహన ముఖ్యమని నోడల్ అధికారులకు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి సూచించారు. శుక్రవారం సాయంత్రం కలక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సంయుక్త కలెక్టర్ ఎ. భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహలతో కలిసి నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నోడల్ అధికారులు ఎన్నికల నియమావళిని అర్థం చేసుకుని విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో నోడల్ అధికారులు డీఆర్‌ఓ షేక్ ఖజావలి, సీపీఓ శేషశ్రీ , డీటీసీ కె. సీతారామిరెడ్డి, జెడ్‌పీ సీఈఓ జ్యోతిబసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి, నగరపాలక సంస్థ అదనపు కమిషనరు ఓబులేశు, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, బిమల్ కుమార్, పీడీలు ప్రసాద్, బి.శంకర్, విజయలక్ష్మి, జిల్లా ఉపాధి అధికారిణి దుర్గాబాయి, డీఎస్‌ఓ కోమలి పద్మ, డీపీఓకే నాగసాయి కుమార్, సమాచార శాఖ ఉప సంచాలకులు అబ్దుల్ రఫీక్ పాల్గొన్నారు. ఏసీ కళాశాలలో బ్యాలెట్ బాక్సులు భద్రపర్చే గదులు, రిసెప్షన్ సెంటర్లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్‌ను కలెక్టర్ పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment