వరంగల్ అర్బన్: వరంగల్ అండర్ రైల్వే జోన్ పరిధిలో నేడు (శనివారం) నీటి సరఫరా ఉండదని బల్దియా ఈఈ బీఎల్ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద 60 ఎంఎల్‌డీ నీటి శుద్ధీకరణ కేంద్రంలో అంతర్గత నిర్వహణ (మెయింటెనెన్స్) పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల వరంగల్ అండర్ రైల్వే గేట్ పరిధిలోని ప్రాంతాలైన తిమ్మాపూర్, కరీమాబాద్, పెరకవాడ, రంగశాయిపేట, ఉర్సు, శంభునిపేట, శివనగర్, ఖిలా వరంగల్, చింతల్, మామునూరు, సింగారం, బొల్లికుంట, భట్టుపల్లి, కడిపికొండ, రాంపేట, రాంపూర్, మడికొండ తదితర ప్రాంతాల్లో ఒకరోజు నీటి సరఫరా బంద్ ఉంటుందని వివరించారు. ఆయా ప్రాంతాల ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కేయూ ఫిల్టర్ బెడ్ పరిధిలో రెండు రోజులు..
ఫిల్టర్ బెడ్ (కేయూసీ) పరిధిలో రెండు రోజులు (శని, ఆదివారాల్లో)నీటి సరఫరా ఉండదని ఈఈ రాజయ్య తెలిపారు. యాదవ నగర్ ప్రాంతంలో పబ్లిక్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో అంతర్గత కనెక్షన్ పనులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో కేయూసీ ఫిల్టర్ బెడ్ పరిధిలోని విద్యారణ్యపురి, కొత్తూరు, గుడిబండల్, యాదవనగర్, పద్మాక్షికాలనీ, మచిలీబజార్, పలివేల్పుల, గుండ్ల సింగారం, పెగడపెల్లి, వంగపహాడ్, ముచ్చర్ల, భీమారం, చింతగట్టు, ఎరగ్రట్టు గుట్ట, హసన్‌పర్తి ప్రాంతాల్లో రెండు రోజులు నీటి సరఫరా నిలిపివేసినట్లు వివరించారు. అంతరాయానికి ఆయా ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment