వరంగల్: హసన్‌పర్తి మండలం మడిపల్లికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు తుమ్మల రాజు(30) హత్యకు గురయ్యాడు. కాళ్లు, చేతులను తాడుతో కట్టి హత్య చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఎస్సారెస్పీలో పడేసినట్లు సమాచారం.. మృతదేహాం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.మడిపల్లికి చెందిన తుమ్మల రాజు బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నాడు.అయితే అన్నాసాగరానికి చెందిన తన బాల్యే స్నహితురాలితో రాజుకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇది వివాహేతర సంబంధానికి దారితీసినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈవిషయమై పలుమార్లు రాజును హెచ్చరించినా మార్పు రాలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.
పట్టుబడ్డడా? ఫోన్ చేసి రిప్పించారా?
ఇదిలా ఉండగా, శనివారం ఉదయం నుంచి రాజు, పక్క గ్రామానికి చెందిన తన పార్టీ నాయకుడితో కలిసి అతిగా మద్య సేవించినట్లు స్థానికులు చెబుతున్నారు. తొలుత ఎల్కతుర్తిలోని ఓ వైన్‌షాపులో, ఆ తర్వాత జయగిరిలో.. అనంతరం అన్నాసాగరంలోని శ్మశాన వాటిక వద్ద మద్యం తాగినట్లు తెలిసింది. అయితే మద్యం సేవించాక.. ఆ యువతి ఇంటికి వెళ్లి పట్టుబడ్డడా? ఫోన్ చేసి రాజును రప్పించి హత్య చేశారా అనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. దుండగులు రాజును ఇంటి వద్దే కట్టేసి ఆటోలో తీసుకెళ్లి హత్యచేసి, ఆ తర్వాత మృతదేహాన్ని ఎస్సారెస్పీలో పడేసినట్లు తెలిసింది.
పోలీసుల అదుపులో నిందితుడు?
కాగా, హత్య అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. రాజును చంపి కాల్వ లో పడేసినట్లు నిందితుడు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. ఘటనా స్థలిని కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజ్ సందర్శించారు. రాజు పట్టుబడ్డడా? ఫోన్‌చేసి రప్పించి హత్యచేశారా? అనేకోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment