
హైదరాబాద్: వాతావరణంలో నెలకొన్న ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. మరో 5 రోజులు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.
ఇప్పటికే 24 గంటల వ్యవధిలో పటాన్‌చెరులో రికార్డు స్ధాయిలో 10.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ సికింద్రాబాద్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. శుక్ర, శనివారాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment