శిశుమందిరాలతోనే సంస్కృతి పరిరక్షణ
బండ్లగూడ: సరస్వతీ శిశుమందిరాల్లోనే సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన విద్య అందుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం శ్రీ శారదాధామంలో 41వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి సమాజానికి అవసరమైన భవిష్యత్ యువతరం శ్రీ సరస్వతీ శిశు మందిరాల ద్వారానే నిర్మాణం అవుతుందని పేర్కొన్నారు. చక్కటి వాతావరణం ఉన్నచోటనే దేశ భవిష్యత్ నిర్మాణం సాధ్యమవుతుంన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతీ వి ద్యాపీఠం తెలంగాణ అధ్యక్షుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డాక్టర్ తక్కెళ్లపల్లి తిరుపతిరావు, భాగ్యనగనర్ విభాగ్ కార్యదర్శి విరివింటి రవీంద్ర శర్మ, ఆవాస విద్యాలయ కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్, అధ్యక్షుడు అర్జున్‌గౌడ్, శ్రీ సరస్వతీ విద్యాపీఠం ప్రాంత సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.