‘చరితార్థం’ పుస్తకావిష్కరణ
సాక్షి, సిటీబ్యూరో: ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఆంధ్ర మహిళాసభ కళాశాలలో ఆనందేశి నాగరాజు రాసిన ’చరితార్థం’ పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నందివెలుగు ముక్తేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ రఘుకుమార్, సెంటర్ ఫర్ సోషియల్ డైలాగ్ కన్వీనర్ వేలూరి రామారావు మాట్లారు. భారత సమాజం, సంస్కృతి, ఆర్థిక అధ్యయనంతో ప్రాచీన భారతదేశ చరిత్రను ‘చరితార్థం’పుస్తకంలో రికార్డు చేశారని వక్తలు అన్నారు. నేటి భారత యువతకు మొదటి భారత ముస్లిం సంఘ సంస్కర్త, లౌకిక ప్రజాస్వామ్యవాది హమీద్ దల్వాయి భావాలు అనుసరణీయమని చెప్పారు. అనంతరం హమీద్ దల్వాయి రచించిన ’లౌకిక భారతదేశంలో ముస్లిం రాజకీయాలు’ అనే అనువాద పుస్తక పరిచయం కార్యక్రమం కూడా జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment