హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘వన్ స్టేషన్..వన్ ప్రొడక్ట్’ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్, నాంపల్లి, బేగంపేట్ రైల్వేస్టేషన్‌లలో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల స్టాళ్లలో అమ్మకాలు పెరిగాయి. నైన్ నట్జ్ అనే ఒక మైక్రో స్టార్టప్ ద్వారా సికింద్రాబాద్ స్టేషన్ ప్లాట్‌ఫారమ్ 10లో ఒక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. చిరుధాన్యాల ఆధారిత స్వీట్లు, స్నాక్స్‌ను విక్రయిస్తున్నారు. ఎం ఫర్ మిల్లెట్స్ అనే మరొక మైక్రో స్టార్టప్ బేగంపేట స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్ –2లో చిరుధాన్యాల చిక్కీలు, ప్రాచీన కాలపు ఆహార పదార్థాలను విక్రయిస్తోంది.
నాంపల్లి స్టేషన్‌లో మరొక మైక్రో స్టార్టప్ మిల్లింగ్ ఆధారిత అల్పాహార చిరు పదార్థాలు,స్నాక్స్ విక్రయిస్తోంది. కేంద్రం సూచన మేరకు ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో మిల్లెట్ల ఉత్పత్తి – వినియోగాన్ని పెంచే లక్ష్యంతో వీటిపై ఈ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్...సికింద్రాబాద్ డివిజన్ అధికారులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment