సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
రాంగోపాల్‌పేట్: లివర్ సిర్రోసిస్‌తో బాధపడుతున్న ఓ 63 ఏళ్ల వృద్ధుడికి చిన్నపాటి కోతతో (మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతి)తో కాలేయ మార్పిడి చేసి అరుదైన ఘనతను సాధించారు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి వైద్యులు. ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ హెపటోబైలియరీ పాంక్రియాస్, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ సచిన్ డాగా తెలిపిన వివరాల ప్రకారం లివర్ సిర్రోసిస్ అనేది చాలా తీవ్రమైన సమస్య, దానికి కాలేయ మార్పిడి మాత్రమే సరైన చికిత్స, దీనికి సాంప్రదాయ పద్ధతిలో పెద్ద కోతలతో శస్త్ర చికిత్సలు చేస్తారు. దీనివల్ల ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండటం, కోలుకునేందుకు చాలా సమయం పడుతుంది. అయితే 63 ఏళ్ల ఓ వృద్ధుడు లివర్ సిర్రోసిస్‌తో బాధపడుతూ కిమ్స్ వైద్యులను ఆశ్రయించారు. అయితే అతడికి చిన్నపాటి కోతతో మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతితో కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేయాలని నిశ్చయించిన వైద్యులు దిగ్విజయంగా ఈ చికిత్సను పూర్తి చేసి ఐదు రోజుల్లోనే డిశ్చార్జ్ చేశారు. ఇది దేశంలోనే అరుదైన శస్త్ర చికిత్స అని డాక్టర్ తెలిపారు.
చికిత్స పొందిన రోగితో వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment