చిట్టీల పుల్లయ్య చిక్కాడు! | - | Sakshi
Sakshi News home page

చిట్టీల పుల్లయ్య చిక్కాడు!

Published Wed, Mar 26 2025 9:18 AM | Last Updated on Wed, Mar 26 2025 9:16 AM

చిట్టీల పుల్లయ్య చిక్కాడు!

చిట్టీల పుల్లయ్య చిక్కాడు!

సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ నుంచి నగరానికి వలసవచ్చి, కూలీగా జీవితం ప్రారంభించి, చిట్టీల వ్యాపారంలోకి దిగి, అధిక వడ్డీ ఆశ చూపి దాదాపు రూ.100 కోట్ల మేర కాజేసిన పుల్లయ్యను సిటీ సీసీఎస్‌ పోలీసులు పట్టుకున్నారు. గత నెల 21 నుంచి పరారీలో ఉన్న ఇతగాడిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్న అధికారులు పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని చందన లక్ష్మింపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య తన స్వగ్రామంలోనూ చిట్టీల వ్యాపారం చేసి పలువురిని మోసం చేశాడు. దాదాపు 18 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చిన ఇతగాడు బీకే గూడ దాసారం బస్తీలో చిన్న గుడిసె వేసుకుని జీవించాడు. కుమారుడు రామాంజనేయులు తాపీ మేసీ్త్రగా, పుల్లయ్య తాపీ పనిలో కూలీగా పని చేసే వాడు. ఇలా స్థానికులతో పాటు దాసారం బస్తీలో ఉండే రిక్షా కార్మికులతో పరిచయాలు పెంచుకున్నాడు. 15 ఏళ్ల క్రితం చిట్టీల వ్యాపారం ప్రారంభించిన ఇతగాడు బిల్డర్లకు ఫైనాన్స్‌ కూడా చేశాడు. పశ్చిమ మండలంలోని ఎస్సార్‌నగర్‌, బల్కంపేట, బీకేగూడ, సనత్‌నగర్‌ తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 500 మంది ఇతడికి ఖాతాదారులుగా మారారు. రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు విలువైన చిట్టీలు వేశాడు. ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ నమ్మకం సంపాదించుకున్న పుల్లయ్య ఆపై ఆ మొత్తాలు తమ వద్దే ఉంచి, వడ్డీలు తీసుకునేలా చేశాడు. ఇలా దాదాపు రూ.100 కోట్ల వరకు కాజేసిన ఇతగాడు గత నెల 21న కుటుంబంతో సహా పారిపోయాడు. బాధితులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సార్‌నగర్‌లో నమోదైన కేసునూ ఈ విభాగానికే బదిలీ చేశారు. ముమ్మరంగా గాలించిన అధికారులు పుల్లయ్యను బెంగళూరులో పట్టుకున్నారు. ఈ కేసులో అతడి భార్య, కుమారుడు సైతం నిందితులుగా ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు. కాజేసిన సొమ్మును పుల్లయ్య ఎక్కడకు మళ్లించాడు? తదితర వివరాలు ఆరా తీస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో

పంచాయతీ కార్యదర్శి మృతి

కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఓ పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన సంఘటన మున్సిపల్‌ పరిధిలోని తిమ్మాపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని రామంతాపూర్‌కు చెందిన సక్కుబాయి (38), పాండు దంపతులు. సక్కుబాయి మహేశ్వరం మండలం ఎన్‌డీతండా పంచాయతీ కార్యదర్శిగా, పాండు అంబర్‌పేట్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం ఇద్దరూ కలిసి సక్కుబాయి అమ్మగారి గ్రామమైన కొందుర్గుకు స్కూటీపై వచ్చారు. గ్రామంలో గతంలో వారు కొనుగోలు చేసిన వ్యవసాయ క్షేత్రంలో చేపడుతున్న పండ్లతోట పనులు చూసి తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యలో తిమ్మాపూర్‌ వద్దకు రాగానే హెచ్‌పీ పెట్రోల్‌బంకు వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్‌ బోల్తా పడింది. అదే సమయంలో లారీ అదుపుతప్పి పక్కనుంచి వెళ్తున్న వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీచక్రాలు బైకుపై నుంచి వెళ్లడంతో సక్కుబాయి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన పాండును చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

స్కూల్‌ బస్‌లో మంటలు

తుర్కయంజాల్‌: షార్ట్‌ సర్క్యూట్‌తో స్కూల్‌ బస్‌లో మంటలు చెలరేగిన ఘటన సాగర్‌ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. నాదరగ్‌గుల్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన బస్సు (టీజీ08 యూ1796) ఇంజాపూర్‌లో విద్యార్థులను దింపేసి, తిరిగి వెళ్తుండగా గుర్రంగూడ వద్ద డ్రైవర్‌ సీటు కిందినుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సు దిగి, తోటి వాహనదారుల సహాయంతో మంటలను ఆర్పేసే ప్రయత్నం చేయడంతో పాటు ఫైరిజింన్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థులు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో సాగర్‌ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

బెంగళూరులో పట్టుకున్న సీసీఎస్‌ పోలీసులు

పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలింపు

భర్తకు

తీవ్ర గాయాలు

విద్యార్థులను దింపేసి వస్తుండగా ఘటన

సాగర్‌ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement