గేట్స్ వ్యాఖ్యలపై దుమారం
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ యథాలాపంగా చెప్పిన ఒక వాక్యం వివాదాస్పదమైంది. తరచూ భారత్‌ను పొగిడే బిల్‌గేట్స్ ఒక్కసారిగా భారత్‌ను ప్రయోగశాలతో పోల్చడమేంటని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రీడ్ హాఫ్‌మన్‌తో నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్ చర్చావేదికలో భారత ప్రస్థానాన్ని బిల్‌గేట్స్ ప్రస్తావించారు. ‘‘ జనాభాపరంగా అతిపెద్దదైన భారత్‌లోనూ ఆరోగ్యం, పోషకాహారం, విద్యారంగాలు అభివృద్ధిబాటలో పయనిస్తున్నాయి.
భారతీయులు సుస్థిరాభివృద్ధిని మాత్రమేకాదు సుస్థిర ప్రభుత్వా దాయాలను సమకూర్చుకుంటున్నారు. వచ్చే 20 ఏళ్లలో అక్కడి ప్రజలు మరింత పురోభివృద్దిని సాధించగలరు. భారత్ వెలుపల కంటే భారత్‌లో తమను తాము నిరూపించుకునేందుకు ఆ దేశం నిజంగా ఒక ప్రయోగశాల. అమెరికా వెలుపల మా అతిపెద్ద కార్యాలయం భారత్‌లోనే ఉంది. ప్రపంచంలో మరెక్కడా పైలట్ ప్రాజెక్టులు మేం చేపట్టినా మా భాగస్వాములు మాత్రం ఇండియా నుంచే ఉంటున్నారు. మీరుగనక భారత్‌కు వెళ్లి అక్కడి వీధుల్లో గమనిస్తే ఆదాయంలో చాలా తారతమ్యాలు ఉన్న వ్యక్తులు కోకొల్లలుగా కనిపిస్తారు. అయినా సరే మీరు అక్కడి వైవిధ్యాన్ని ఆస్వాదించగలరు’’ అని అన్నారు.
వెల్లువెత్తిన విమర్శలు
భారత్‌ను ప్రయోగశాలగా పోల్చడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ‘‘ తమ ప్రయోగాత్మక ఔషధాలను ప్రయోగించడానికి భారత్‌ను ఒక ల్యాబ్‌లాగా వాడుకుంటున్నారు. అయినాసరే ఇలాంటి పెద్దమనుషులు మనల్ని గినీ పందుల్లా వాడుకునేందుకు మన ప్రభుత్వాలే అనుమ తిస్తున్నాయి. దిగ్భ్రాంతికరం. సిగ్గుపడాల్సిన విషయం’’ అని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘మా దేశం మీకొక ప్రయో గశాల అనుకుంటున్నారా?. అయితే దేశం విడిచి వెళ్లిపొండి’ అని ఒక నెటిజన్ వ్యాఖ్యా నించారు. ‘‘ బిల్‌గేట్స్ భారతీయ మీడియా మొదలు విపక్షం, అధికార పక్షం ద్వారా ప్రతి వ్యవస్థనూ తనకు అనుకూలంగా మార్చుకుందన్నారు. మనమెప్పుడు మేల్కొంటామో’’ అని ఇంకో నెటిజన్ ఆవేదన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment