లండన్: చుక్‌చుక్ రైలు వస్తోంది. దూరం దూరం జరగండి అనే అంటున్నారు శాస్త్రవేత్తలు. కోవిడ్ నేపథ్యంలో రైలు ప్రయాణం భద్రమని హెచ్చరిస్తున్నారు. రైలు ప్రయాణంలో కరోనా సోకే ముప్పు ఎంత ఉందో శాస్త్రీయంగా అంచనాలు వేశారు. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తో పాటు యూకేకి చెందిన కొన్ని యూనివర్సిటీల శాస్త్రవేత్తలు ప్రయాణికుల మధ్య ఉన్న దూరం, ఎంత సేపు కలిసి ప్రయాణం చేస్తారు ? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అధ్యయనం నిర్వహించారు.
► రైలు ప్రయాణికులు ఎంత దగ్గరగా కూర్చున్నారన్న దానిని బట్టి వైరస్ వ్యాప్తి రేటు 0.32%గా ఉంటుంది.
► కోవిడ్ రోగి పక్కనే కూర్చొని ప్రయాణం చేస్తే సగటున వైరస్ వ్యాప్తి 3.5% ఉంటుంది.
► రోగితో పాటుగా ఒకే వరుసలో కూర్చొని ప్రయాణం చేస్తే వైరస్ సోకడానికి 1.5% అవకాశం ఉంది.
► కోవిడ్ రోగి ఖాళీ చేసిన సీటులో మరొక ఆరోగ్యవంతుడు వచ్చి కూర్చుంటే 0.75% రేటుతో వైరస్ వ్యాప్తి చెందుతుంది.
► బోగీలో ఉండే మొత్తం ప్రయాణికుల సంఖ్యను బట్టి వారు ప్రయాణించే సమయాన్ని బట్టి ప్రతీ గంటకి వైరస్ సోకే ముప్పు 1.3% పెరుగుతూ ఉంటుంది.
ప్రయాణాలు ఎలా ?
ఒక గంటసేపు కలిసి ప్రయాణం చేస్తే ఇద్దరు ప్రయాణికుల మధ్య దూరం ఒక మీటర్ కంటే ఎక్కువ ఉండాలని, అదే రెండు గంటల ప్రయాణమైతే 2.5 మీటర్ల కంటే ఎక్కువ దూరం పాటించాలని యూకేలోని సౌతాంప్టన్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్త షెంగ్జీ లాయ్ అన్నారు. రైలు ప్రయాణానికి ముందు టెంపరేచర్ చెకింగ్ తప్పనిసరిగా చేయాలని ఆయన సూచించారు
దయచేసి వినండి
Published Sun, Aug 2 2020 4:06 AM | Last Updated on Sun, Aug 2 2020 11:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment