రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ ఫోన్‌కాల్
ఉక్రెయిన్‌తో యుద్ధం పొడిగించొద్దని పుతిన్‌ను కోరిన ట్రంప్
ట్రంప్‌తో ఇదివరకే మాట్లాడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
వాషింగ్టన్: రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలియడంలేదు. అయితే పలు దేశాలు ఈ యుద్ధాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. తాజాగా అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.
వాషింగ్టన్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించి తగిన సలహాలు ఇచ్చారని, ఈ యుద్ధాన్ని తీవ్రతరం చేయవద్దని కోరారని తెలుస్తోంది. అలాగే ఐరోపాలో అమెరికాకు ఉన్న బలమైన సైనిక ఉనికి గురించి రష్యాను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించే మార్గాలపై చర్చించారు. ఉపఖండంలో శాంతిని కొనసాగించే ప్రయత్నాల గురించి కూడా చర్చించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. ఇదివరకే ఫోన్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే.
కాగా ట్రంప్ తాజాగా పుతిన్‌తో సంభాషించడంపై ఉక్రెయిన్ ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అయితే ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం దీనిని ఖండించింది. ఈ ఫోను సంభాషణ గురించి ఉక్రెయిన్‌కు ఎలాంటి ప్రాథమిక సమాచారం ఇవ్వలేదని, ఇది తప్పుడు రిపోర్టు అని పేర్కొంది.
BREAKING: 🇺🇸🇷🇺 President-elect Donald Trump holds phone call with Russia's Vladimir Putin to discuss de-escalating the war in Ukraine. pic.twitter.com/2pDW1vARaE
— BRICS News (@BRICSinfo) November 10, 2024
మరోవైపు ట్రంప్‌తో ఉక్రెయిన్‌పై చర్చించేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నారని రష్యా ప్రకటించింది. అయితే రష్యా తన డిమాండ్లను మార్చుకోవడానికి సిద్ధంగా ఉందని దీని అర్థం కాదని కూడా రష్యా స్పష్టం చేసింది. కాగా ఇప్పటివరకూ పుతిన్- ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అధికారికంగా ధృవీకరణ పొందలేదు. స్కై న్యూస్ వంటి ప్రధాన వార్తా నెట్‌వర్క్‌లు కూడా ఈ నివేదికను స్వతంత్రంగా ధృవీకరించలేదు.
ఇది కూడా చదవండి: పేజర్ దాడులు మా పనే: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
Comments
Please login to add a commentAdd a comment