బాలుడి ప్రాణాలు కాపాడిన డ్రోన్‌  | Drone Lifeguard Service Saves Teenager From Drowning In Spain | Sakshi
Sakshi News home page

బాలుడి ప్రాణాలు కాపాడిన డ్రోన్‌ 

Published Thu, Jul 28 2022 2:22 AM | Last Updated on Thu, Jul 28 2022 2:22 AM

Drone Lifeguard Service Saves Teenager From Drowning In Spain - Sakshi

డ్రోన్స్‌... వీడియో, ఫొటోషూట్స్, వివిధ సరుకుల డెలివరీ చేయడమే కాదు మనుషుల ప్రాణాలనూ కాపాడుతున్నాయి. స్పెయిన్‌లో ఓ లైఫ్‌గార్డ్‌ డ్రోన్‌ బాలుడి ప్రాణాలు కాపాడింది. వాలెన్సియా బీచ్‌లో సాధారణ తనిఖీల్లో ఉన్న డ్రోన్‌ పైలట్‌ మిగెల్‌ ఏంజిల్‌ పెడ్రెరో అలల ధాటికి ఓ బాలుడు కొట్టుకుపోతుండటం గమనించాడు. అది గుర్తించిన పెడ్రెరో వెంటనే డ్రోన్‌ ద్వారా లైఫ్‌గార్డ్‌ వెస్ట్‌ను కిందికి విసిరాడు.

కానీ పెద్ద పెద్ద అలల తాకిడికి అది ఆ అబ్బాయిని చేరడం కష్టమైంది. కొద్ది ప్రయత్నం తరువాత ఎట్టకేలకు వెస్ట్‌ను అందుకున్న బాలుడు... దాని సహాయంతో కోస్ట్‌గార్డ్‌ బోట్‌ వచ్చేంతవరకూ ప్రాణాలు నిలుపుకోగలిగాడు. అనంతరం బోట్‌లో వచ్చిన కోస్ట్‌గార్డ్స్‌ బాలుడిని అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. 24 గంటల తరువాత హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ట్విట్టర్‌లో ‘అవర్‌ వరల్డ్‌’పోస్ట్‌ చేసిన ఈ వీడియో వైరల్‌ అవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement