
లాహోర్: పాకిస్తాన్‌లో దైవదూషణకు పాల్పడినట్లు ఆరోపిస్తూ శ్రీలంక దేశస్తుడొకరిని శుక్రవారం అమానుషంగా కొట్టి చంపడంతోపాటు మృతదేహాన్ని కాల్చేశారు. పంజాబ్ ప్రావిన్స్ సియాల్‌కోట్‌కు సమీపంలోని ఓ దుస్తుల దుకాణం మేనేజర్‌గా శ్రీలంకకు చెందిన ప్రియంత కుమార(40)పనిచేస్తున్నారు.
శుక్రవారం ఆయన తన కేబిన్‌కు సమీపంలో అంటించిన అతివాద పార్టీ తెహ్రీక్–ఇ–లబ్బాయక్(టీఎల్‌పీ) పోస్టర్‌ను చించివేసి, డస్ట్‌బిన్‌లో పడేశారు. ఆ పోస్టర్‌పై పవిత్ర ఖురాన్‌లోని వాక్యాలున్నాయి. ఈ విషయం బయటకు పొక్కింది.
ఫ్యాక్టరీ వద్ద గుమికూడిన వందలాది మంది టీఎల్‌పీ కార్యకర్తలు ఆగ్రహంతో ప్రియంతను బయటకు ఈడ్చుకెళ్లి విపరీతంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు అక్కడికి చేరుకోకమునుపే వారు మృతదేహాన్ని కాల్చివేశారు. ఘటనకు సంబంధించి 100 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment