
బెంగళూరు: అమెరికాకు చెందిన నాసా, భారత్‌కు చెందిన ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ఉపగ్రహం ఇస్రో చెంతకు చేరింది. నాసా–ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్(నిసార్)ను అమెరికాలోని కాలిఫోర్నియాలో తయారుచేయగా ఆ దేశ వాయుసేనకు చెందిన సీ–17 విమానం దానిని బెంగళూరుకు తీసుకొచ్చింది.
‘ నిసార్ భారత్‌కు బుధవారం వచ్చేసింది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిౖలైట్ తుది ఇంటిగ్రేషన్ మొదలైంది’ అని చెన్నైలోని అమెరికా కాన్సులేట్ జనరల్ బుధవారం ట్వీట్ చేసింది. వ్యవసాయ సంబంధ మ్యాపింగ్, కొండచరియలు విరిగే ప్రమాదమున్న ప్రాంతాల గుర్తింపు తదితరాల కోసం నిసార్‌ను వినియోగించనుంది. ఏపీలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి వచ్చే ఏడాదిలో ఈ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది.
Comments
Please login to add a commentAdd a comment