చంద్రుని చెంతకు ఓరియాన్‌ | Nasa Orion capsule reaches moon on way to record-breaking lunar orbit | Sakshi
Sakshi News home page

చంద్రుని చెంతకు ఓరియాన్‌

Published Tue, Nov 22 2022 5:33 AM | Last Updated on Tue, Nov 22 2022 5:33 AM

Nasa Orion capsule reaches moon on way to record-breaking lunar orbit - Sakshi

వాషింగ్టన్‌: పలు అడ్డంకుల్ని, బాలారిష్టాల్ని దాటుకుంటూ నాసా ఇటీవల ఎట్టకేలకు ప్రయోగించిన ఓరియాన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రున్ని చేరి చరిత్ర సృష్టించింది. అది చందమామకు వెనకవైపుగా 128 కిలోమీటర్ల సమీపానికి వెళ్లిందని నాసా సోమవారం ప్రకటించింది. దీన్ని అత్యంత కీలకమైన ముందడుగుగా అభివర్ణించింది. నాసా విడుదల చేసిన వీడియోల్లో చంద్రుడు అతి భారీ పరిమాణంలో కనువిందు చేస్తూ కనిపిస్తున్నాడు. అత్యంత శక్తిమంతమైన ఆర్టెమిస్‌ రాకెట్‌ ద్వారా గత బుధవారం ఓరియాన్‌ను నాసా ప్రయోగించడం తెలిసిందే. ఇందులో మనుషులను పోలిన మూడు డమ్మీలను పంపారు.

50 ఏళ్ల క్రితం నాసా చేపట్టిన అపోలో మిషన్‌ తర్వాత చంద్రున్ని చేరిన తొలి అంతరిక్ష ప్రయోగం ఇదే. ఇది విజయవంతమైతే తర్వాతి మిషన్లో మనుషులను, 2024లో మూడో మిషన్లో వ్యోమగాములను పంపనున్నారు. సరిగ్గా ఓరియాన్‌ చంద్రునికి అత్యంత సమీపానికి చేరిన సమయానికే అరగంట పాటు దాన్నుంచి కమ్యూనికేషన్‌ పూర్తిగా తెగిపోవడంతో ఏం జరిగిందో తెలియక ఒక దశలో గందరగోళం నెలకొంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే శుక్రవారం మరో ఇంజన్‌ను పేల్చడం ద్వారా ఓరియాన్‌ను చంద్రుని కక్ష్యలోకి పూర్తిగా ప్రవేశపెడతారు. చంద్రునిపై దిగకుండా దాదాపు వారంపాటు అది కక్ష్యలోనే గడుపుతుంది. అనంతరం డిసెంబర్‌ 11న భూమికి తిరిగి రావాలన్నది ప్లాన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement