రష్యా ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం మొదలై ఆరో రోజులైంది. రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో బాంబుల వర్షం కురిపిస్తోంది. తాజగా ఈ సమస్యకు పరిష్కారం దిశగా.. రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండవ రౌండ్ చర్చలు మార్చి 2 న జరగనున్నాయని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. అయితే ఈ చర్చలు ఎక్కడ జరగనున్నాయన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. దీనిక సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కాగా ఫిబ్రవరి 28న బెలారస్‌లో రష్యా ఉక్రెయిన్‌ల మధ్య సుమారు 4 గంటల చర్చలు జరిగాయి. మొదట ఉక్రెయిన్ చర్చలు అవసరం లేదని మొండి వైఖరిని ప్రదర్శించిన చివరికి అంగీకరించింది. ఈ చర‍్చకు ఉక్రెయిన్ నుంచి ఆరుగురు, రష్యా నుంచి ఐదుగురు ప్రతినిధులు పాల్గొన్నారు. ఉక్రెయిన్ డిమాండ్లను చూస్తే.. యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని, క్రిమియా నుంచి కూడా బలగాలను తొలగించాలిని తెలిపింది. రష్యా మాత్రం నాటోలో ఉక్రెయిన్ చేరదనే లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని పట్టుబడినట్టు సమాచారం. అయితే, ఇరు వర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా చర్చలు విఫలమైయ్యాయి. మరి మార్చి 2న జరగబోయే చర్చ అయినా సఫలం అవ్వాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment