దుబాయ్: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ హెచ్చరికలు జారీ చేశారు. తమ అంతరంగిక వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకోరాదన్నారు. ‘అట్లాంటిక్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్.. ‘అమెరికా సొంత విషయాలపై అధ్యక్షుడు బైడెన్ మాట్లాడాలి. మాది సంపూర్ణ రాజరిక దేశం. నా గురించి బైడెన్ అపార్థం చేసుకున్నా పట్టించుకోను. అమెరికా గురించి మాకు అవసరం లేదు. వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఆ దేశంతో చిరకాల బంధాన్ని బలోపేతం చేసుకోవడమే మా లక్ష్యం’ అని చెప్పారు. బైడెన్ వచ్చాక రెండు దేశాల మధ్య దూరం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment