మాస్కో: కరోనా వైరస్ ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రయోగాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రష్యా స్పుత్నిక్ వీ తర్వాత మరో వ్యాక్సిన్‌ను అక్టోబర్ 15 నాటికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. సైబీరియాకి చెందిన వెక్టార్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న ఎపివాక్ కరోనా వ్యాక్సిన్‌ను అక్టోబర్ 15 నాటికి రిజిస్టర్ చేసుకోవచ్చునని రష్యా వినియోగదారుల భద్రతా సంస్థ మంగళవారం వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌కి సంబంధించిన మొదటి దశ ప్రయోగాలు గత వారమే పూర్తయ్యాయి.
భారత్‌లో త్వరలో స్పుత్నిక్ వీ ప్రయోగాలు
రష్యా మొదటి వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ మూడో దశ ప్రయోగాలు తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఆసియా, దక్షిణ అమెరికా, మధ్య ప్రాచ్యానికి చెందిన 10 దేశాలు రష్యాతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్‌కు సైతం దాదాపు కోటి డోసుల్ని పంపిణీ చేయడానికి రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) ఇటీవల ఒప్పందం చేసుకోవడం తెల్సిందే. దీనికి సంబంధించిన ప్రయోగాలను డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ మరికొద్ది వారాల్లో ప్రారంభించనున్నట్టు ఆ సంస్థ ఫార్మాసూటికల్ సర్వీసెస్ అధికారి దీపక్ సార్వా తెలిపారు. దేశవ్యాప్తంగా తొలి దశలో దాదాపు 2,000 మంది వాలంటీర్లకు డోసులు ఇస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నట్టు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment